Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి బుధవారం నాటికి 'ఫెంగల్' తుఫానుగా (Cyclone Fengal) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తమిళనాడులోని ప్రాంతాలకు తీవ్ర వర్షపాత హెచ్చరికను ప్రకటించింది.

Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Chennai, Nov 27: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి బుధవారం నాటికి 'ఫెంగల్' తుఫానుగా (Cyclone Fengal) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తమిళనాడులోని ప్రాంతాలకు తీవ్ర వర్షపాత హెచ్చరికను ప్రకటించింది. నవంబర్ 27. మంగళవారం ఉదయం నుండి చెన్నై నగరం మరియు శివారు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

గురువారం (నవంబర్ 28) వరకు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. నిన్న ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారనుందని... తుఫాను తుపానుగా మరింత బలపడి ఉత్తర దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.బాలచంద్రన్ తెలిపారు. IMD ప్రకారం, అల్పపీడనం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27న తుఫానుగా మారే అవకాశం ఉంది.

తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

సైక్లోన్ ప్రభావంతో తమిళనాడులోని (Tamil Nadu) మయిలాదుతురై, తిరువారూర్, నాగపట్టణం, చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్‌పేట్, కడలూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) పేర్కొంది. దీంతో చెన్నై, చెంగల్‌పేట్, కడలూర్, మయిలాదుతురై ప్రాంతాల్లో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది

నాగపట్టణం, మయిలాదుతురై, తిరువారూర్‌ ప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉండడంతో స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా రేపటి వరకు ఓ మాదిరి వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కడలూర్, మయిలాదుతురైలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ నిన్ననే రెడ్ అలెర్ట్ జారీచేసింది. చెన్నైలో నేటి వరకు ఎల్లో అలెర్ట్ జారీచేయగా, పొరుగున ఉన్న కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్‌పేట్‌లకు బుధ, శనివారాల మధ్య ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది