Cyclone Michaung Update: వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, ఎయిర్‌పోర్ట్‌లోకి భారీగా వరద, మిచాంగ్ తుఫాను విధ్వంసానికి చెన్నై ఎలా విలవిలలాడుతుందో వీడియోల్లో చూడండి
రానున్న 24 గంటల్లో చెన్నైతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
Cyclone Michaung Live Updates: మిచాంగ్ తుఫాను ఉత్తర తమిళనాడు తీరం వైపు వస్తున్నందున, భారీ వర్షాలు, తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా చెన్నైలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రానున్న 24 గంటల్లో చెన్నైతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ప్రస్తుతం చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైచాంగ్ తుఫాను (Cyclone Michaung) ఈరోజు మధ్యాహ్నానికి తీవ్ర తుపానుగా మారుతుందని చెన్నై ప్రాంతీయ మెట్రాలజీ డైరెక్టర్ బాలచంద్రన్ తెలిపారు.
చెన్నైను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల ధాటికి కొట్టుకుపోయిన కార్లు, వీడియో ఇదిగో..
చెన్నైలోని వీలాచెరి, పల్లికరానై ప్రాంతంలో పలు కార్లు వరద నీటిలో కొట్టుకపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను రద్దు చేయగా కొన్ని విమానాలను దారిమళ్లించారు.చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే సహా ఎయిర్‌ప్లేన్ పార్కింగ్ జోన్ వరద నీటితో నిండిపోయింది. రానున్న 24 గంటల్లో చెన్నైతో పాటు పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది.
ఇది రేపు మధ్యాహ్నం 4 గంటలకు నెల్లూరు-మచిలీపట్నం మీదుగా ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతుంది. చెన్నై చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు మరియు బలమైన గాలులు కొనసాగుతాయి.మైచాంగ్ తుపాను ప్రభావంపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది, పెట్రోలింగ్ నిర్వహిస్తోంది మరియు హెల్ప్‌లైన్ నంబర్‌లను అందిస్తోంది. తుఫాను కారణంగా ఇప్పటివరకు 60 రైళ్లు రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్వో తెలిపారు.
నేడు, రేపు స్కూళ్లకు సెలవు...నెల్లూరు, ప్రకాశం వైపు దూసుకొస్తున్న మైచాంగ్ తుఫాను
మైచాంగ్ తుఫాను (Cyclone Michaung Update) కారణంగా రాష్ట్రంలోని చెన్నై తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను రేపు అంటే డిసెంబర్ 5న మూసివేస్తున్నట్లు తమిళ ప్రభుత్వం ప్రకటించింది.బేసిన్ బ్రిడ్జ్ మరియు వ్యాసర్పాడి మధ్య బ్రిడ్జ్ నెం.14 వద్ద ప్రమాద స్థాయి కంటే ఎక్కువ నీరు ప్రవహిస్తున్న దృష్ట్యా భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేయబడింది.పుఝల్ సరస్సులో నీటి మట్టం ప్రమాదకర స్థాయి దాటేడయంతో గేట్లును పైకెత్తి కిందకి వదిలిపెడుతున్నారు
Here's Videos
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మిచాంగ్ గంటకు 13 కిలో మీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. రేపు మధ్యాహ్నానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య ఈ తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. దాంతో భారత వాతావరణ కేంద్రం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీర ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీచేసింది. మత్స్యకారులు చేపల వేటకు పోకూడదని, జనం సముద్ర తీరం వైపు వెళ్లవద్దని హెచ్చరించింది.
తుఫాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు నదుల్లా ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దాంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రైవేట్ కంపెనీలను కోరింది. లేదంటే అవసరమైన మేర తక్కువ సిబ్బందితో మాత్రమే పని చేయాలని సూచించింది. ముఖ్యంగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లోని ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో చెన్నై అంతటా వర్షాలు ప్రారంభమయ్యాయని, డిసెంబర్ 5 వరకు తీవ్రత మరింత పెరుగుతుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని చెంగల్‌పేట్, చాంచీపురం, తిరువళ్లూరుతోసహా ఇతర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా చైన్నైలోని పలు మెట్రో స్టేషన్ల వద్ద నీరు నిలిచిపోయింది. సెయింట్ థామస్ మెట్రో స్టేషన్‌లో 4 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో లోపలికి వెళ్లే మార్గం మూసుకుపోయింది. దీంతో ప్రయాణికులంతా ఆలందూరు మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కాలని అధికారులు సూచించారు.
వర్షం కారణంగా మెట్రో స్టేషన్ల వద్ద ఉండే ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతంలో అదనపు నీరు నిలిచిపోయింది. దీంతో ఆ నీటిని బయటికి పంపుతున్నారు. నీటి ఎద్దడి ఉన్నప్పటికీ ఉదయం 5 గంటలకు మెట్రో సేవలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. అయితే అనేక రహదారులు జలమయం కావడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కోరింది.
తమిళనాడులోని 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. ఐఎండీ తుఫాను హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా చర్యగా చెన్నై సహా తిరువళ్లూరు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలను సిద్ధం చేసింది స్టాలిన్ ప్రభుత్వం.
మిచాంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రోడ్లపై చెట్లు విరిగిపడి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగిపోయాయి. రోడ్డు పక్కన పార్క్ చేసిన కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. పల్లికరానే, వీలాచెరి తదితర ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోవడం కనిపించింది.
చెన్నైలోని సబ్ వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు. చెన్నైలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నైనుంచి రాకపోకలు జరిపే పలు రైళ్లను రద్దు చేశారు. కోయంబత్తూరు-చెన్నై మార్గంలో తమ విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మరో 24 గంటలపాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.