Cyclone Nisarga: తీరాన్ని తాకిన నిసర్గ తుఫాను, తీరం దాటేందుకు మూడు గంటల సమయం, 120 కిలోమీటర్ల వేగంతో గాలులు, అలర్ట్ అయిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటడానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉండటంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు (Maharashtra, Gujarat) అప్రమత్తమయ్యాయి. పలు గ్రామాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF)బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి.

Cyclone-Nisarga- (Photo-ANI)

Mumbai, June 3: రాయగడ్‌ జిల్లాలోని అలీబాగ్‌ వద్ద ‘నిసర్గ’ తుపాను (Cyclone Nisarga) తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటడానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉండటంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు (Maharashtra, Gujarat) అప్రమత్తమయ్యాయి. పలు గ్రామాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF)బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి. నిసర్గ ముప్పు, ముంబై వెళ్లే పలు విమానాలు రద్దు, దేశ ఆర్థిక రాజధానికి వెళ్లేవారు అప్రమత్తం కావాలని కోరిన విమానయాన సంస్థలు

రాయ్‌గఢ్‌ జిల్లాలో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను దృష్ట్యా కొన్ని రైళ్లు రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ముంబైలో ఇప్పటికే 144 సెక్షన్‌ అమలులోకి తీసుకువచ్చారు. ముంబైలో రెండు రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు జారీ చేశారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు పుణెలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Here's ѕαtчα prαdhαn Tweet

తుఫాన్ నేప‌థ్యంలో ముంబైలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. దాదాపు వందేళ్ల త‌ర్వాత ముంబై తీరాన్ని తుఫాన్ తాక‌నుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాలపై నిసర్గ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండ‌నున్న‌ది. జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్‌ఎఫ్‌) తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. పెను తుఫాన్ భయం, వణుకుతున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు, వందేండ్ల తర్వాత తొలిసారిగా ముంబైపై విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్

తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో 40 వేల మందిని, గుజరాత్‌లో 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంబై పరిసర ప్రాంతాల్లో 20 ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను మోహరించారు. గుజరాత్‌లో 15 ఎన్డీఆర్‌ఎఫ్‌, 6 ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలను మోహరించారు. దక్షిణ గుజరాత్‌లోని పరిశ్రమలను ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు.

నిసర్గ తుపాను తాకిడిని తట్టుకునేందుకు రాష్ట్రంలో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. తుపాను 16 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ యూనిట్లలో 10 బృందాలు తుఫాను సహాయక చర్యల్లో ఉన్నాయని ఇంకా 6 బృందాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది

1797600