IndiGo Aircraft | Representational Image (Photo Credits: ANI)

Mumbai, June 3: దేశంలో కరోనావైరస్ (Coronavirus) కల్లోలం పోకముందే మరో విపత్తు దూసుకొస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను నిసర్గ తుపాను అల్లకల్లోలం చేయనుంది. నిసర్గ తుపాను (Cyclone Nisarga) పెనువేగంతో ముంబై తీరంవైపు దూసుకొస్తోందన్న వాతావరణ శాఖ (IMD)హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. పెను తుఫాన్ భయం, వణుకుతున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు, వందేండ్ల తర్వాత తొలిసారిగా ముంబైపై విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్

బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రాకపోకలను సాగించే విమానాలను రద్దు చేశాయి. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలు (IndiGo,Vistara, SpiceJet ) పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సమాచారాన్ని సంబంధిత ప్రయాణీకులకు అందించామనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు అప్రమత్తంగా కావాలని సూచించాయి.

Here's Tweets

ఇండిగో మొత్తం 17 విమానాలను రద్దు చేసింది. . ముంబై నుండి చండీగఢ్, రాంచీ పాట్నాకు కేవలం మూడు విమానాలను మాత్రమే నడుపుతున్నట్టు ఇండిగో పేర్కొంది. ప్రత్యామ్నాయ విమానంలో తిరిగి బుక్ చేసుకునే అవకాశం లేదా క్రెడిట్ సౌకర్యాన్ని అందివ్వనున్నామని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు నమోదు, దేశంలో 2 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు, 5815కు చేరిన మరణాల సంఖ్య

ఇక మరో సంస్థ విస్తారా తుపాను కారణంగా తమ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. ప్రధానంగా ముంబై, గోవా మధ్య విమానాలను రద్దు చేసినట్టు తెలిపింది. మరిన్ని వివరాలకు విస్తారా అధికారిక వెబ్ సైట్ ను గానీ, 9289228888 నంబరుగానీ సంప్రదించాలని ట్వీట్ చేసింది. అలాగే ముంబై నుంచి , ఢిల్లీ కోల్‌కతాకు వెళ్లే విమానాలను కూడా బుధవారం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎయిరిండియా ఉదయం విమానాలను రీషెడ్యూల్ చేస్తోంది. అలాగే విమాన షెడ్యూల్‌లో ఏదైనా రద్దు, మార్పులను ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని స్పైస్‌జెట్ తెలిపింది. కాగా కరోనా వైరస్ , లాక్ డౌన్ కారణంగా పూర్తిగా నిలిచిపోయిన దేశీయ విమాన ప్రయాణాలకు ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఇటీవల అనుమతి లభించించి. మళ్లీ ఇంతలోనే నిసర్గ తుపాను రూపంలో అంతరాయం ఏర్పడింది.