Cyclone Remal: అర్థరాత్రి బెంగాల్ తీరాన్ని తాకిన రెమాల్ తుఫాన్, భారీ వర్షాలకు ఏడుగురు మృతి, అంధకారంలో 15 మిలియన్ల మంది ప్రజలు

దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీచిన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. తుపాను కారణంగా కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది.

Cyclone Remal Seven Dead, 15 Million Without Power As aSevere Cyclone Remal Lashes Coasts of Bangladesh With Devastating Winds

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఆదివారం రాత్రి బెంగాల్ తీరాన్ని తాకింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీచిన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. తుపాను కారణంగా కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది.

120 కి.మీ వేగంతో విధ్వంసకర గాలులుతో వందలాది గ్రామాలను ముంచెత్తిన తీవ్ర తుపాను 'రెమల్‌' కారణంగా కనీసం ఏడుగురు మృతి చెందగా లక్షలాది మంది అంధకారంలో చిక్కుకుపోయారు. ఆదివారం అర్ధరాత్రి తీరం దాటిన తర్వాత గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఉదయం 5.30 గంటలకు సాగర్ ద్వీపానికి ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాతావరణ వ్యవస్థ, కుండపోత వర్షం కురిపించి, ఈశాన్య దిశగా కదిలి తుఫానుగా మారిందని ఆ శాఖ తెలిపింది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాగే ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌కు ముందు బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను రెమల్. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుఫానులకు పేరు పెట్టే విధానం ప్రకారం ఈ తుఫానుకు ఒమన్ రెమాల్ (అరబిక్ భాషలో ఇసుక అని అర్థం) అని పేరు పెట్టారు. తీవ్ర తుపానుగా మారిన రెమాల్‌.. ఈ రాత్రి బెంగాల్ తీరం దాటే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

తుఫానుతో బలమైన గాలులతో పాటుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగ్లాదేశ్ లోని బరిసల్, భోలా, పటుఖాలి, సత్ఖిరా, చటోగ్రామ్‌తో సహా ప్రాంతాలపై ప్రభావం చూపింది. పటువాఖాలీలో, ఒక వ్యక్తి తన సోదరి, అత్తను ఆశ్రయానికి తీసుకురావడానికి ఇంటికి తిరిగి వస్తుండగా తుఫాను తాకిడికి కొట్టుకుపోయాడు. సత్ఖిరాలో మరో వ్యక్తి తుపాను సమయంలో రక్షణ కోసం పరుగెత్తడంతో కిందపడి మరణించాడు. బరిషల్, భోలా మరియు చటోగ్రామ్‌లో ఐదుగురు వ్యక్తులు మరణించారని ఢాకాకు చెందిన సోమోయ్ టీవీ నివేదించింది.మోంగ్లాలో, ఒక ట్రాలర్ మునిగిపోయింది, ఒక చిన్నారితో సహా ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.

కొన్ని ప్రాంతాల్లో 12 గంటలకు పైగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది, అయితే తుఫాను తగ్గిన తర్వాత కనెక్షన్లను పునరుద్ధరించడానికి విద్యుత్ కార్మికులు సన్నాహాలు చేస్తున్నారు. తీరప్రాంతాల్లో ఉదయం 9:45 గంటల వరకు తుఫాను కొనసాగుతోందని బంగ్లాదేశ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ బోర్డు చీఫ్ ఇంజనీర్ (ప్లానింగ్ అండ్ ఆపరేషన్) బిశ్వనాథ్ సిక్దర్ తెలిపారు.  దూసుకొస్తున్న తుఫానుకు రెమాల్‌గా నామకరణం, ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదే, ఆదివారం తీరం దాటే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు తప్పిన సైక్లోన్ ముప్పు

ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 15 మిలియన్ల మంది ప్రజలు విద్యుత్తు లేకుండా ఉన్నారని ఆయన అంచనా వేశారు. మెట్ ఆఫీస్ ప్రకారం, రెమల్ తుఫాను ఉత్తర దిశగా కదిలి, తీరం దాటి ప్రస్తుతం ఖుల్నాలోని కోయిరా సమీపంలో ఉంది. తుఫాను ఉత్తరం వైపు తన పథాన్ని కొనసాగిస్తుందని, వర్షపాతం పెరిగి, వచ్చే 2-3 గంటల్లో తక్కువ తీవ్రతకు బలహీనపడుతుందని బంగ్లాదేశ్ వాతావరణ శాఖ సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రత్యేక బులెటిన్‌లో తెలిపింది.

ఆదివారం అర్ధరాత్రి ల్యాండ్‌ఫాల్ అయిన తర్వాత 'రెమల్' గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలి వీచిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాలు సోమవారం ఉదయం ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఆదివారం నాటి తుఫాను కారణంగా దేశంలోని మూడు ఓడరేవులు మరియు రెండవ అతిపెద్ద నగరం చటోగ్రామ్‌లోని విమానాశ్రయాన్ని మూసివేయవలసి వచ్చింది.

తుపాను కారణంగా కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు రోడ్లపై నేలకూలగా, మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.అలాగే సుందర్‌బన్‌లోని గోసాబా ప్రాంతంలో శిథిలాలు పడి ఒక వ్యక్తి గాయపడ్డాడు. కోల్‌కతాకు ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, ఇళ్లు జలమయమయ్యాయి. రెస్క్యూ, విపత్తు నిర్వహణ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

తుపాను తీరం దాటడంతో బెంగాల్(West Bengal), ఉత్తర ఒడిశా, అస్సాం, మేఘాలయలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు మే 27-28 తేదీల్లో మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వాతావరణ శాఖ ప్రకారం తుఫాను తీరం దాటే సమయంలో గాలి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఈ క్రమంలో రెమాల్ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపడా మధ్య తీరాన్ని తాకింది.

వాతావరణ శాఖ ప్రకారం తుపాను(Remal Cyclone) ప్రస్తుతం బలహీనపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంపై తీవ్ర తుఫాను 'రెమాల్' గత 6 గంటల్లో గంటకు 13 కిమీ వేగంతో ఉత్తరం వైపు కదిలిందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో మే 27 ఉదయం నాటికి రెమాల్ క్రమంగా బలహీనపడి తుపానుగా మారుతుందని వెల్లడించింది. మరో 2 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా.