బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం తెలిపింది. ఈ రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదే. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుఫానులకు పేరు పెట్టే విధానం ప్రకారం దీనికి రెమాల్ అని పేరు పెట్టారు.
శుక్రవారం ఉదయం నాటికి ఈ వ్యవస్థ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని IMD శాస్త్రవేత్త మోనికా శర్మ తెలిపారు.శనివారం ఉదయం ఇది తుఫానుగా మారి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని ఆమె తెలిపారు. IMD ప్రకారం, ఆదివారం, తుఫాను గంటకు 102 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తమిళనాడులో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
పశ్చిమ బెంగాల్, మిజోరం, త్రిపురలోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. , దక్షిణ మణిపూర్, ఉత్తర ఒడిశాలో మే 27 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి తీరానికి వెళ్లాలని సూచించారు. వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా, తుఫానులు వేగంగా బలపడుతున్నాయని, ఎక్కువ కాలం వాటి శక్తిని నిలుపుకుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించాయి.ఈ క్రమంలో తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు..
బంగాళాఖాతంలోని తీవ్ర తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రమాదం లేదని.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలకు భారీ నష్టం ఉండొచ్చని హెచ్చరిస్తూ.. ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీపై తుఫాన్ ప్రభావం తక్కువగానే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. మత్యకారులు, నావికులకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నందున అప్రమత్తంగా వుండాలని సూచించింది.
అల్పపీడనం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా్ల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. సముద్రంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఫైబర్ బోట్లు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. రేపు అంటే మే 24 వరకూ తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షితం ప్రదేశాలకు తరలివెళ్లాలని హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావం ఇవాళ్టి నుంచి మే 27 వరకూ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై కూడా ఉండవచ్చని తెలుస్తోంది.
ఇక నైరుతి రుతుపవనాలైతే ముందుగా ఊహించినట్టే మే 31న కేరళ తీరాన్ని తాకనున్నాయి. జూన్ నెలలో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్ని తాకిన నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి.