Cyclone

Newdelhi, May 26: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన రెమాల్‌ తుపాన్‌ (Cyclone Remal) బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌ గా మారింది. నేటి అర్ధరాత్రి సాగర్‌ ద్వీపం, ఖేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్‌ (West Bengal) వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్‌, నాగాలాండ్‌, అసోం, మేఘాలయ, అండమాన్‌ నికోబర్‌ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఏఐసీటీఈ కెరీర్‌ పోర్టల్‌ ప్రారంభం.. https://student-career-portal.aicte-india.org/ లో రిజిస్టర్ అవ్వండి మరి!!

మత్స్యకారులకు అలర్ట్

తెలంగాణ, ఏపీపై తుపాను ప్రభావం లేకపోయినప్పటికీ.. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని చెప్పింది.

ఢిల్లీలో ఘోరం.. అర్ధరాత్రి పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి (వీడియో)