Silvassa Shocker: నాలుగేళ్ల బాలిక రేప్‌కు సహకరించలేదని గొంతు కోసి చంపేసిన కామాంధుడు, చిన్నారి మృతదేహం చూసి తట్టుకోలేక విషం తాగిన తండ్రి, దాద్రానగర్‌ హవేలీలో అమానుష ఘటన

ఓ యువకుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిగా ఆ పాప ప్రతిఘటించడంతో గొంతు కోసి చంపేశాడు. మృతదేహం చూసి తట్టుకోలేని ఆమె తండ్రి పురుగు మందు తాగి మృతి చెందాడు. ఈ అమానుష ఘటన (Dadra and Nagar Haveli Shocker) దాద్రానగర్‌ హవేలీలోని సిల్వస్సాలో చోటుచేసుకుంది.

Image used for representational purpose | (Photo Credits: File Image)

SILVASSA, Mar 15: కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్‌ హవేలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిగా ఆ పాప ప్రతిఘటించడంతో గొంతు కోసి చంపేశాడు. మృతదేహం చూసి తట్టుకోలేని ఆమె తండ్రి పురుగు మందు తాగి మృతి చెందాడు. ఈ అమానుష ఘటన (Dadra and Nagar Haveli Shocker) దాద్రానగర్‌ హవేలీలోని సిల్వస్సాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన సంతోష్‌ రజత్‌(30) సిల్వస్సాలో చిన్నఉద్యోగాలు చేస్తున్నాడు. శుక్రవారం తన ఫ్లాట్‌ వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. లైంగికదాడికి యత్నించగా చిన్నారి కేకలు (Man kills 4-year-old girl during rape bid) వేసింది.

దీంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి చంపి గోనెసంచిలో కట్టి ఫ్లాట్‌ పక్క సందులో పడేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పరిసరాల్లో గాలించారు. ఆ సమయంలో రజత్‌ ఇంట్లో బాత్‌రూంలో రక్తపుమరకలు కనిపించడంతో చుట్టుపక్కల శోధించగా బాలిక మృతదేహం ఉన్న సంచి కనిపించింది. విచారణలో రజత్‌ నేరాన్ని అంగీకరించాడు. కూతురు విగతజీవిగా కనిపించడంతో తట్టుకోలేని ఆమె తండ్రి శనివారం పురుగు మందు తాగి (victim's father commits suicide ) బలవన్మరణం చెందాడు. నిందితుడిపై పోక్సోతోపాటు తదితర నేరాల కింద కేసులు నమోదు చేశారు.

అమానుషం, నాలుగేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధులు లైంగిక దాడి, పదేళ్ల జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా విధించిన పోక్సో కోర్టు, 2013లో జరిగిన దారుణ ఘటనపై తాజాగా తీర్పు ఇచ్చిన న్యాయస్థానం

లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని నిబంధనలతో పాటు ఐపిసి సెక్షన్ 364 (అపహరణ), 376 (అత్యాచారం), 377 (అసహజ నేరాలు) మరియు 302 (హత్య) కింద నిందితులపై కేసు నమోదు చేసినట్లు డిఎన్‌హెచ్ పోలీసు సూపరింటెండెంట్ హరేశ్వర్ స్వామి తెలిపారు. .