POCSO Court: ఐదేళ్ల బాలికపై కామాంధుల కీచక పర్వం, సమాజానికే తలవంపులు తెచ్చిందన్న పోక్సో కోర్టు, 2013లో చోటు చేసుకున్న సంఘటన, జనవరి 30న దోషులకు శిక్ష విధింపుపై విచారణ చేస్తామని తెలిపిన కోర్టు
నిర్భయ ఘటన (Nirbhaya Rape Case) జరిగిన నాలుగు నెలల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) మరో దారుణమైన ఘటన చోటు చేసుకున్నదనే విషయం చాలామందికి తెలియదు. ఐదేళ్ల బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. 2013లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఈ కేసులో ఇద్దరు నిందితులను పోక్సో కోర్టు(POCSO court) శనివారం దోషులుగా నిర్ధారించింది.
New Delhi,January 19: నిర్భయ ఘటన (Nirbhaya Rape Case) జరిగిన నాలుగు నెలల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) మరో దారుణమైన ఘటన చోటు చేసుకున్నదనే విషయం చాలామందికి తెలియదు. ఐదేళ్ల బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. 2013లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఈ కేసులో ఇద్దరు నిందితులను పోక్సో కోర్టు(POCSO court) శనివారం దోషులుగా నిర్ధారించింది.
ఈ ఘటన సమాజానికే తలవంపులు తెచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. మన సమాజంలో మైనర్ బాలికలను(Minor Girls) దేవతలుగా ఆరాధిస్తారు. కానీ ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది’ అని పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది.
ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి
2012 డిసెంబర్‌లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు తర్వాత నాలుగు నెలలకు ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. నిందితులు మనోజ్ షా, ప్రదీప్ కుమార్(convicted Manoj Shah,Pradeep Kumar) బాధితురాలిని లైంగికంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని అక్కడే వదిలేసి వెళ్లారు.
దోషులను క్షమించి వదిలేయమంటున్న న్యాయవాది ఇందిరా సింగ్, భగ్గుమన్న నిర్భయ తల్లి
40 గంటల తరువాత ఏప్రిల్ 17న బాలికను పోలీసులు రక్షించారు. ఢిల్లీ పోలీసులు బీహార్ లోని ముజఫర్ నగర్ లో ఓ నిందితుడిని, దర్బాంగాలో మరో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు మే 24 చార్జిషీట్ దాఖలు చేశారు. జూలై 11న అభియోగాలు మోపుతూ హాజరుపరిచారు.
ప్రస్తుతం ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి (Additional Sessions Judge)నరేశ్‌కుమార్ మల్హోత్రా(Naresh Kumar Malhotra) ఇద్దరినీ దోషులుగా నిర్ధారించారు. బాలికను వారు క్రూరంగా హింసించారని వ్యాఖ్యానించారు.దోషులకు శిక్షల విధింపుపై జనవరి 30న విచారిస్తామని కోర్టు తెలిపింది. తన కుమార్తెకు న్యాయం లభించినందుకు బాలిక తండ్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘విచారణ రెండేళ్ళలో పూర్తి కావాలి, కానీ ఆరేళ్ల తరువాతైనా మాకు న్యాయం లభించినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)