Nirbhaya Case: దేశ చరిత్రలో తొలిసారి, నిర్భయ దోషుల ఉరిశిక్ష దృశ్యాలు లైవ్ టెలికాస్ట్‌కు అనుమతివ్వాలంటూ కేంద్ర సమాచార శాఖను కోరిన ఎన్జీవో సంస్థ, ఈ నెల 22న వారికి ఉరిశిక్ష
Nirbhaya case: NGO seeks live telecast of rapists' execution (photo-PTI)

New Delhi, January 11: నిర్భయ కేసు (Nirbhaya case)దోషులకు పటియాలా కోర్టు ఈ నెల 22న కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉరిశిక్ష దృశ్యాలను మీడియాలో ప్రదర్శించేందుకు అనుమతివ్వాలని ఎన్జీవో సంస్థ(NGO) కేంద్ర సమాచార శాఖ(I&B)ను (Ministry of Information and Broadcasting)కోరింది. దీనిపై కేంద్ర సమాచార శాఖ నిర్ణయం ఏంటనేది అధికారికంగా ప్రకటించలేదు.

దాదాపు 8 సంవత్సరాల క్రితం ఢిల్లీలో మెడిసిన్‌ చదువుతున్న బాలికను బస్సులో దారుణంగా రేప్‌ చేసిన ఆ క్రూర మృగాళ్ల మరణాన్ని యవత్‌ దేశ ప్రజలు చూడేలా మీడియాలో ఆ దృశ్యాలను ప్రసారం చేయాలని(live telecast) ఎన్జీవో కేంద్ర సమాచార శాఖను ఆశ్రయించింది.

అక్షయ్ కుమార్ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

కాగా నిర్భయ (Nirbhaya)మరణించిన 8 సంవత్సరాల అనంతరం దోషులకు కోర్టు ఉరిశిక్ష అమలు చేసింది. దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది.

ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు... తీహార్ జైల్లో(Tihar Jail) ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో... జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

నిర్భయ దోషులకు జనవరి 22న మరణశిక్ష

మరోవైపు నలుగురు దోషులను ఒకేసారి ఉరితీసేందుకు ఇప్పటికే తీహార్ జైలులో నాలుగు ఉరికంబాలు, నాలుగు సొరంగాలను అధికారులు ఏర్పాటు చేశారు. నలుగురిని ఒకేసారి ఉరితీయడం దేశచరిత్రలో ఇదే తొలిసారి.

నిర్భయ దోషి వినయ్‌ కుమార్‌శర్మ క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు

ఇదిలా ఉంటే నిర్భయ దోషి వినయ్‌ కుమార్‌శర్మ సుప్రీంకోర్టులో(Supreme Court ) క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని వినయ్‌ కుమార్‌ శర్మ పిటిషన్‌ దాఖలు చేశాడు . న్యాయపరంగా తనకున్న చివరి అవకాశాన్ని శర్మ వినియోగించుకున్నాడు. నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్‌ జారీ చేస్తూ రెండు రోజుల క్రితం ఢిల్లీ పటియాలా కోర్టు సంచలన తీర్చు వెల్లడించిన విషయం తెలిసిందే.

నా రక్తంతో రాస్తున్నా, వారిని ఉరి తీసే అవకాశం నాకివ్వండి

ఈ నెల 22న ఉదయం గంటలకు తిహార్ జైల్లో వీరిని ఉరి తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆలోగా దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని సూచించింది. ఈ నేపధ్యంలో వినయ్‌ శర్మ క్యురేటిన్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.