Delhi Gang Rape Case: దోషులను క్షమించి వదిలేయమంటున్న న్యాయవాది ఇందిరా సింగ్, భగ్గుమన్న నిర్భయ తల్లి, మీలాంటి వారి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదంటూ విమర్శలు
Nirbhaya's Mother has said that the law and order has failed as the culprits are still alive | (Photo Credits: PTI)

New Delhi, January 18: నిర్భయపై (Nirbhaya) హేయమైన రీతిలో అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన దోషులను క్షమించి వదిలేయమని నిర్భయ తల్లికి సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ (Indira Jaising) ట్విట్టర్ ద్వారా సంచలన సూచన చేశారు. ఈ విజ్ఞప్తిపై నిర్భయ తల్లి ( Nirbhaya Mother) తీవ్రంగా స్పందించారు. నిర్భయ తల్లి ఆశాదేవి (Asha Devi)నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించేవరకూ తనకు సంతృప్తి ఉండదని నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను క్షమించాలనే దారుణమైన సలహా ఆమె ఎలా ఇవ్వగలరని మండిపడ్డారు.

ఇలాంటి వాళ్ల వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఇలాంటి సలహా ఇవ్వడానికి అసలు ఇందిరా జైసింగ్‌ ఎవరు? దోషులను ఉరి తీయాలని దేశమంతా కోరుకుంటోంది. అసలు ఆమె ఇంత ధైర్యం ఎలా చేయగలిగారు. సుప్రీంకోర్టు (supreme Court)ఆవరణలో ఆమెను చాలాసార్లు నేరుగా కలిశాను.

కానీ ఎప్పుడూ కూడా నా క్షేమ సమాచారాల గురించి ఆమె అడగలేదు. కానీ ఈరోజు దోషుల తరఫున మాట్లాడుతోంది. ఆమె లాంటి వాళ్లు రేపిస్టులకు మద్దతు పలుకుతూ జీవనోపాధి పొందుతూ ఉంటారు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష దృశ్యాలు లైవ్ టెలికాస్ట్‌కు అనుమతివ్వాలంటూ కేంద్ర సమాచార శాఖను కోరిన ఎన్జీవో సంస్థ 

Here's the tweet by Indira Jaising:

2012వ సంవత్సరంలో పారామెడికల్ విద్యార్థిని అయిన నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా కొట్టి హతమార్చిన విషయం విదితమే.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ((Delhi Gang Rape Case) దోషులను ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి తీసేందుకు రంగం సిద్ధమైంది.

Here's the tweet:

ఈ నేపథ్యంలో... తాను నిర్భయ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. అయితే ఉరిశిక్షకు కూడా తాను పూర్తి వ్యతిరేకమని ఇందిరా జైసింగ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు.. రాజీవ్‌ గాంధీ దోషులను సోనియా గాంధీ(Sonia Gandhi) క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి కూడా నలుగురు దోషులను(Nirbhaya Case Convicts) క్షమించాలని ట్విటర్‌ వేదికగా ఆమె విజ్ఞప్తి చేశారు.

నా రక్తంతో రాస్తున్నా, వారిని ఉరి తీసే అవకాశం నాకివ్వండి

నిర్భయ దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించడంతో ఫిబ్రవరి 1వతేదీన వారిని ఉరి తీయాలని నిర్ణయించిన క్రమంలో ప్రముఖ మహిళా న్యాయవాది నిర్భయ తల్లికి ఈ సూచన చేశారు.

అక్షయ్ కుమార్ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

తన కుమార్తె పేగుల్ని కూడా బైటకు లాగి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడినవారికి ఉరిశిక్ష పడేవరకూ తనకు మనశ్శాంతి లేదని వారి ఉరి కోసం తాను వేయి కళ్లతో ఎదురు చూస్తున్నానని నిర్బయ తల్లి ఆశాదేవి స్పష్టంచేశారు. నిర్భయ నిందితుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని దేశ‌మంతా కోరుకుంటున్న‌దని అది జరిగి తీరాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.