New Delhi, January 14: 2012 నిర్భయ గ్యాంగ్ రేప్ మరియు హత్య కేసులో తమ మరణశిక్ష అమలును సవాలు చేస్తూ నలుగురిలో ఇద్దరు దోషులు - వినయ్ కుమార్ శర్మ, ముఖేష్ సింగ్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ముందుగా దోషి వినయ్ శర్మ తన మరణశిక్షను సవాలు చేస్తూ చివరి ప్రయత్నంగా క్యురేటివ్ పిటిషన్ వేయగా, అతడి తరువాత ముఖేష్ సింగ్ కూడా క్యురేటివ్ పిటిషన్ పెట్టుకున్నాడు. వీరి పిటిషన్లను జస్టిస్ ఎన్‌వి రమణ, అరుణ్ మిశ్రా, రోహింటన్ ఫాలి నారిమన్, ఆర్ బానుమతి, అశోక్ భూషణ్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించి, ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఈ పిటిషన్ల వాదనకు ఎలాంటి అర్హత లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. తాజా తీర్పుతో దోషుల మరణ శిక్షను ఆపే చిట్టచివరి 'న్యాయ' పరమైన అవకాశం కూడా ఉపయోగించబడింది.
కోర్ట్ తీర్పు పట్ల సుప్రీంకోర్ట్ సంతోషం వ్యక్తం చేశారు, ఏడేళ్ల తన న్యాయ పోరాటం ఫలించిందని పేర్కొన్నారు. అయితే దోషులు ఉరితీయబడిన రోజే తనకు సంతోషకరమైన రోజుగా ఆమె పేర్కొన్నారు.
ఇక ముందుగా డెత్ వారెంట్ జారీ చేసిన ప్రకారం, నలుగురు దోషులను జనవరి 22, ఉదయం 7 గంటలకు ఉరితీస్తారు. తీహార్ జైలు అధికారులు ఇప్పటికే దోషుల బరువుతో కూడిన ఇసుక బస్తాలతో ఉరితీతకు ట్రయల్స్ నిర్వహించారు.
అయితే, ఉరి నొప్పి పెట్టకుండా మృదువుగా జరిగేటట్లు తాడుకు పండిన అరటిపండ్లను ఉపయోగించనున్నట్లు నివేదికలు తెలిపాయి. ఉరికంబం ఎక్కే ముందు వారిలో ఎలాంటి అలజడి, అందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో, మనసు తేలికపడేలా చేసేందుకు ఒక కౌన్సిలర్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నిర్భయ దోషుల ఉరిశిక్ష దృశ్యాలు లైవ్ టెలికాస్ట్‌కు అనుమతివ్వాలంటూ కేంద్ర సమాచార శాఖకు వినతులు
2012 డిసెంబర్ 16న 23 ఏళ్ల యువతి 'నిర్భయ' ను ఆరుగురు సామూహిక అత్యాచారం చేసి, అత్యంత క్రూరంగా ఆమెను హింసించడం ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత కాలానికి ప్రాణాలు విడిచింది. దీంతో ఆ ఆరుగురిని అరెస్టు చేసి అత్యాచారం, హత్య తదితర అభియోగాలతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వీరిలో ఒకడు బాల నేరస్థుడు కాగా, మరొకడు రామ్ సింగ్ అనే వ్యక్తి 2013లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా నలుగురు వినయ్ శర్మ, అక్షయ్ సింగ్ ఠాకూర్, ముఖేశ్ సింగ్ మరియు పవన్ గుప్తాలు మరో వారం రోజుల్లో ఉరికంబం ఎక్కనున్నారు.