CM Atishi Comments on Amith Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై సీరియ‌స్ కామెంట్స్ చేసిన ఢిల్లీ సీఎం అతిషి, గ్యాంగ్ స్ట‌ర్ల‌కు అడ్డాగా మారింద‌ని ఆగ్ర‌హం

ఢిల్లీ లా అండ్‌ ఆర్డర్‌ను చేతిలో పెట్టుకుని కేంద్రం ఏం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన అతిశీ.. కేంద్ర మంత్రి అమిత్‌ షాపై (Amith Shah) తీవ్ర విమర్శలు గుప్పించారు.

Atishi (Photo Credits: X/@AtishiAAP)

New Delhi, NOV 20: ఢిల్లీ నగరం గ్యాంగ్‌స్టర్లకు అడ్డాగా మారిందని ఢిల్లీ సీఎం అతిశీ (Delhi CM Atishi) అన్నారు. ఢిల్లీ లా అండ్‌ ఆర్డర్‌ను చేతిలో పెట్టుకుని కేంద్రం ఏం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన అతిశీ.. కేంద్ర మంత్రి అమిత్‌ షాపై (Amith Shah) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఇటీవల సుందర్‌నగరిలో ఇద్దరు యువకులు ఓ మహిళను వేధిస్తుండగా ఆమె కుటుంబీకులు, బంధువులు మందలించి పంపించారని, అది మనుసులో పెట్టుకున్న ఆ ఇద్దరు యువకులు తిరిగి కత్తులతో వచ్చి దాడికి పాల్పడ్డారని, ఆ దాడిలో 28 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని అతిశీ వెల్లడించారు. ఇవాళ మృతుడి కుటుంబాన్ని కలిసిన ఆమె రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.

Maharashtra Exit Poll Result 2024: ఇండియా కూటమికి షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ కూటమి, పూర్తి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో..  

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఢిల్లీ గ్యాంగ్‌స్టర్లకు రాజధానిగా మారిందని, నేరస్థులు, దోపిడీదారులు, గూండాలకు భయం లేకుండా పోయిందని అన్నారు. నేరస్థులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో నేరాలు పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుంచి తాను ఓ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నానని, ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత ఆయన చేతుల్లో పెట్టుకుని ఏం చేస్తున్నారని అతిశీ ప్రశ్నించారు. ఆయనకు ఎన్నికల ప్రచారం మీద ఉన్న ధ్యాస ఢిల్లీలో శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Delhi High Court: అత్యాచార బాధితులకు ఆస్పత్రులన్నీ ఉచితంగా వైద్య చికిత్స అందించాల్సిందే, కీలక ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం