IPL Auction 2025 Live

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై ఈడీ దూకుడు, తెలంగాణ, ఏపీతో సహా 40 ప్రాంతాల్లో సోదాలు, తెలంగాణలో హీటెక్కిన పొలిటికల్ టెన్సన్

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతోపాటు పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.

File image of Enforcement Directorate | (Photo Credits: ANI)

New Delhi, September 16: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ (ED) దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతోపాటు పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.

ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృంధాలు ఏర్పడి బెంగళూరు, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్‌లోని పలువురి ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. మూడు నెలల క్రితం మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా ఆయన తెలిపిన సమాచారం మేరకు లిక్కర్‌ స్కామ్‌లో (Delhi Liquor Scam) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇదే వ్యవహారంలో గత నెల కూడా వివిధ ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే.

తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లోని రాయదుర్గం, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు లిక్కర్‌ పాలసీ దక్కించుకున్న కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.ఇదిలా ఉంటే లిక్కర్‌ స్కామ​్‌పై బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌ సిర్సా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ కుంభకోణం వ్యవహారంలో హైదరాబాద్‌ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు,

లిక్కర్‌ స్కాం కేసుపై సీబీఐ విచారణ, కాషాయపు నేతలపై పరువునష్టం దావా వేసిన ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేతల అరెస్టులపై మండిపడిన కిషన్ రెడ్డి, మీరు మిగులుతారా అంటూ తలసాని మాస్ వార్నింగ్

ఎవరెవరిని కలిశారు... ఢిల్లీ నుంచి ఎవరు హైదరాబాద్‌ వెళ్లి ఎవరెవరిని, ఎప్పుడు కలిశారు.. అనే వాటి గురించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో తాము చేసిన ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున వివరాలన్నీ తెలంగాణలోనే చెబుతామన్నారు. హైకోర్టు స్టే విధించిన కారణంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడట్లేదన్నారు.

బీజేపీ నేతలు విడుదల చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోలో నిందితుడు చెప్పినవి వాస్తవాలైతే.. సీబీఐ నాలుగురోజుల్లో (సోమవారం లోగా) తనను అరెస్టు చేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సవాల్‌ విసిరారు. ఒకవేళ అరెస్టు చేయలేకపోతే.. ఈ వీడియో మరో అబద్ధమని, కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రధాని మోదీ, బీజేపీ కేంద్ర కార్యాలయం చేసిన కుట్రగా ఒప్పుకొన్నట్లేననిఅన్నారు. దీనికి మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, సిసోడియా సవాల్‌ను కేజ్రీవాల్‌ ప్రశంసించారు. ధైర్యం, నిజాయతీ ఉన్నవారే ఇలాంటి సవాళ్లు చేస్తారన్నారు.