KCR vs Bandi Sanjay (File Image)

Hyd, August 23: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోందని బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది వెల్లడించారు. లిక్కర్‌ స్కాంలో (Delhi Liquor Scam) కేసీఆర్‌ కుటుంబానికి సంబంధం లేకుంటే.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారంటూ విలేకరుల సమావేశంలో ఎంపీ ( BJP MP Sudhanshu Trivedi) మండిపడ్డారు. మంగళవారం బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, మరో ఎంపీ పర్వేష్‌వర్మతో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్‌లు జరుగుతున్నాయని అన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత పాత్రపై సీబీఐ విచారణ (CBI probe will reveal truth in liquor scam) జరుగుతోందని తెలిపిన త్రివేది.. కేసీఆర్‌ కుటుంబానికి సంబంధం లేకుంటే బండి సంజయ్‌ను ఎందుకు అరెస్టు చేశారని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాస్వామ్యుతంగా ధర్నా చేస్తే అరెస్టు చేస్తారా?. రాజకీయ కారణాలతోని అన్యాయంగా అరెస్టు చేశారు. కానీ, దర్యాప్తు సంస్థలు ఈ కేసులో పూర్తిగా శోధించి సత్యాన్ని బయటకి తీస్తాయి. మేం ఆరోపణలు చేస్తే కవిత ఎందుకు భయపడుతున్నారు?. ఎంపీగా సంజయ్‌కు నిరసన తెలిపే హక్కు లేదా? అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా మేము పారదర్శకంగా పనిచేస్తున్నాం అని ఎంపీ సుధాన్షు వెల్లడించారు.

తెలంగాణలో లిక్కర్‌ స్కామ్‌ ప్రకంపనలు, కల్వకుంట్ల కవితే ప్రధాన సూత్రధారి అంటూ బీజేపీ ఆరోపణలు, నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కేసీఆర్‌ కూతురు, బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఏమన్నారంటే..

ఇక ఢిల్లీలో మద్యం దుకాణాలకు ఎల్ - వన్ కమిషన్ రెండు నుంచి 12 శాతం పెంచారని, అది ఎందుకో ఇప్పటివరకు ఎందుకు సమాధానం చెప్పలేదని ఢిల్లీ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేత పర్వేష్‌ వర్మ మండిపడ్డారు. ‘ఢిల్లీలో ఒక బాటిల్‌కు మరొక బాటిల్ ఉచితంగా ఇచ్చారు. కార్టెల్‌గా మారి జోన్లు ఇవ్వాలని మద్యం విధానంలో లేదు. మద్యం ఉత్పత్తి , డిస్ట్రిబ్యూషన్ , రిటైలర్.. ఈ మూడు ఒక్కరే. మహాదేవ్, బడి పంజా కంపెనీలు ఈ బిజినెస్ చేస్తున్నాయి. కరోనా నష్టాల పేరుతో 144 కోట్ల రూపాయలు మద్యం మాఫియాకు మాఫీ చేశారు.

బండి సంజయ్‌ అరెస్ట్, కార్యకర్తల తోపులాట మధ్యే ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బీజేపీ కార్యకర్తలపై-పోలీసుల దాడికి నిరసనగా సంజయ్ దీక్ష

ఇది మద్యం పాలసీకి వ్యతిరేకం. ఎల్ -1 రిటైలర్ కు క్రెడిట్ నోట్ ఇచ్చి, వారి నుంచి వచ్చే నగదు ఆప్ పార్టీకి తరలించారు. ఆ డబ్బు ఎన్నికలకు వినియోగించి మోదీకి మేమే పోటీ అని అంటున్నారు. ఈ పాలసీ వల్ల విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యంపై పన్ను కూడా తగ్గించారు. పన్నులలో, ఆదాయంలో ప్రభుత్వానికి ఖజానాకు గండి కొట్టారు. మొత్తం 6,500 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం జరిగింది. ఆ ధనం ఎక్కడికి వెళ్ళింది అని ఎంపీ పర్వేష్‌ వర్మ, ఆప్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.

బీజేపీ నేతలపై పరువునష్టం దావా: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టుల్లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసిన 29 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు బంజారాహిల్స్‌ సీఐ నరేందర్‌ తెలిపారు. కాగా, వారిలో 26 మంది అరెస్ట్‌ చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇక, నిందితులపై ఐపీసీలో 341, 147, 148, 353, 332, 509, రెడ్‌ విత్‌ 149 కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

వేటు పడింది, ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు, పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు బీజేపీ ప్రకటన

బీజేపీ నేతల ఆరోపణలు, ఆందోళనలపై టీఆర్‌ఎస్‌ నేతలు స్పందించారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ఎల్వీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ-ఐటీ కేసు వివరాలు బీజేపీ వాళ్లకు ముందే ఎలా తెలుస్తాయి. మా బతుకమ్మ జోలికి వస్తే, మీ బతుకులు ఆగం అయిపోతాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసి, రౌడీయిజం చేస్తారా?. రౌడీయిజం కాకుండా మళ్లీ దీక్షలు, నిరసనలా? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు కీలు బొమ్మలుగా మారాయి. కార్పొరేట్లు అంబానీ, అదానీ చేతిలో మోదీ కీలుబొమ్మగా మారిపోయారు. దర్యాప్తు సంస్థలు ఎవరి మీదనైనా దాడులు చేయాలంటే.. వారు మోదీకి వ్యతిరేకులైనా అయి ఉండాలి.. లేదా బీజేపీలో చేరనివారైనా అయి ఉండాలన్నారు.

మరోవైపు.. కవిత ఇంటి వద్ద ఆందోళనకు దిగిన 26 మంది బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక, కవిత ఇంటి వద్ద ఆందోళనల నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్పొరేటర్లు.. ఆమె ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. భౌతిక దాడులు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా పార్టీ మంత్రులు, కార్యకర్తలు, వేలాది మంది సైన్యం మీలాగే ఆలోచిస్తే.. మీరు(బీజేపీ నేతలు) మిగులుతారా?. మీ పార్టీ ఆఫీసులు, ఇళ్లు ఉంటాయా అని హెచ్చరించారు.

బీజేపీ నేతల అరెస్ట్‌లపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి: ఇక ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేపీ ఆందోళనలు, దీక్ష నేపథ్యంలో బండి సంజయ్‌ సహా కొందరు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బీజేపీ నేతల అరెస్ట్‌లపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. మంత్రి కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్‌ అభద్రతా భావంతో ఉన్నారు. విష ప్రచారం చేయడం, అక్రమ కేసులు పెడుతున్నారు.

సీఎం కార్యాలయమే స్వయంగా టీఆర్‌ఎస్‌ మంత్రులు, ప్రజా ప్రతినిధులను రెచ్చగొట్టి.. బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వినాశకాలే.. విపరీత బుద్ధి అన్నట్టుగా.. త్వరలోనే కేసీఆర్‌ కుటుంబ, ప్రజా వ్యతిరేక పాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలుగుతుంది. ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నారు’’ అని స్పష్టం చేశారు.

వరుస అరెస్టులపై బీజేపీ నిరసనలకు పిలుపు: ఇదిలా ఉండగా.. వరుస అరెస్టులపై బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం 5-6 గంటల వరకు అన్ని మండలాల్లో పార్టీ ఆఫీసుల వద్ద నిరసనలు తెలపాలని నిర్ణయించింది. నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టాలని నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు.. ఉప్పుగల్‌, కూనూర్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ ఫ్లెక్సీలకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిప్పంటించారు.

విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ పార్టీ : మద్యం పాలసీపై ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ‘మద్యాన్ని విచ్చలవిడిగా, అవినీతిపరులతో విక్రయాలు జరుపుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు మద్యం పాలసీని రూపొందించటం విచిత్రం. ప్రభుత్వ పాలసీలపై సచివాలయంలో లేదా కేబినెట్‌లో నిర్ణయాలు జరుగుతాయి. ప్రభుత్వ పాలసీలపై హోటల్‌లో నిర్ణయాలేంటి? ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వచ్చి.. మద్యం పాలసీలపై నిర్ణయాలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క.