మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. నుపూర్‌ శర్మ​ ఎపిసోడ్‌తో రాజాసింగ్‌పై తక్షణం చర్యలు చేపట్టింది పార్టీ హైకమాండ్‌. దీంతో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాజాసింగ్‌ విడుదల చేసిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ హైకమాండ్‌ .. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వడానికి బీజేపీ పది రోజులు గడువిచ్చింది. సెప్టెంబర్‌ 2లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)