Delhi Water Crisis: నీటి విడుదలకు ససేమిరా అంటున్న హరియాణా. నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు జరిమానా కట్టాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు

మరో పక్క నీటి కరువుతో ఢిల్లీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి వాటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా నీరు వృథా చేస్తే 2వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది.

AAP Leader Atishi (Photo Credits: X/@BlackKn595065350)

New Delhi, May 29: దేశ రాజధాని ఢిల్లీలో భానుడి శివాలెత్తుతున్నాడు. మరో పక్క నీటి కరువుతో ఢిల్లీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి వాటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా నీరు వృథా చేస్తే 2వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది.

వాటర్‌ట్యాంకులు ఓవర్‌ఫ్లో అయినా, మంచి నీటితో కార్లు, ఇతర వాహనాలు కడిగినా, భవన నిర్మాణాలకు, వాణిజ్య అవసరాలకు నీటిని వాడినా ఫైన్‌ కట్టాల్సిందేనని వాటర్‌ బోర్డు ప్రకటించింది. నీరు ఎక్కడ వృథా అవుతుందో పరిశీలించడానికి ఢిల్లీ వాటర్‌బోర్డుకు చెందిన 200 బృందాలు రంగంలోకి దిగనున్నాయి. వాణిజ్య సముదాయాలు, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఉన్న అక్రమ తాగునీటి కనెక్షన్‌లను తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం ఢిల్లీ మహానగరంలో 200 బృందాలను రంగంలోకి దింపినట్లు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది.  దేశ రాజధానిలో రికార్డు స్థాయి టెంపరేచర్, వెను వెంటనే చిరుజల్లులు, 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుతో ఢిల్లీ వాసులు విలవిల

ఈ బృందాలు ఉదయం 8.00 గంటల నుంచి నీటి వృధా ఎక్కడ జరుగుతున్నా వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ఫైన్ సైతం విధిస్తాయని తెలిపింది. ఇక నగరంలో అక్రమంగా నీటి కనెక్షన్లు ఉంటే.. వాటిని వెంటనే నిలిపి వేయాలని ఈ సందర్బంగా ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఢిల్లీ మంచి నీటి శాఖ మంత్రి అతిషి బుధవారం ప్రకటించారు.

హరియాణా నుంచి తమకు రావాల్సిన నీటి వాటా కోసం ఆప్‌ సర్కార్‌ పోట్లాడుతోంది. ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని మంత్రి అతిశీ నిన్న చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న నీటి వనరుల్ని పొదుపుగా వాడుకోవడంపై దృష్టిసారించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నీటి వృథాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు.