Heatwaves (photo-File image)

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదయింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్‌పూర్‌ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశచరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. అయితే అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఢిల్లీలో చిరు జల్లులు కురిశాయి.  కాలు బ‌య‌ట‌పెట్టాలంటే వ‌ణికిపోతున్న ఢిల్లీ ప్ర‌జ‌లు, దారుణంగా ప‌డిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు (Video)

మరోపక్క ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్‌ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్‌ ఫీల్‌ పరిస్థితులు నెలకొన్నాయి.