New Delhi, JAN 17: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రంగా (Cold wave) ఉంది. తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi Cold) చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల్లో లాగే ఇవాళ ఉదయం కూడా అక్కడ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు (Mercury Drops To 4 Degrees Celsius) నమోదయ్యాయి. ఉదయం పూట బయటికి వచ్చిన చలికి గజగజ వణుకుతున్నారు.
#WATCH | People sit around the bonfire to keep themselves warm as the cold wave continues in Delhi
(Visuals from Paharganj, shot at 12:20 am) pic.twitter.com/ygjmoqfYJe
— ANI (@ANI) January 16, 2024
ఎముకలు కొరికే చలికి తాళలేక పలు ప్రాంతాల్లో జనం చలిమంటలు వేసుకుని చలి కాగుతున్నారు. ఇళ్లు కూడా లేని నిస్సహాయులకు ఢిల్లీలోని నైట్ షెల్టర్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఫుట్‌పాత్‌లపై ఉండే పలువురు రాత్రి వేళల్లో ఆ నైట్ షెల్టర్‌లలో తలదాచుకుంటున్నారు.
Delhi Airport has reported delays in flight operations affecting around 120 flights, both (domestic and international) arrivals and departures, due to dense fog: Delhi Airport FIDS (Flight Information Display System)
— ANI (@ANI) January 17, 2024
చలి కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కమ్ముతోంది. దాంతో రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
#WATCH | Delhi: Several flight operations delayed at IGI airport due to low visibility amid fog. pic.twitter.com/hG1DUKllEt
— ANI (@ANI) January 17, 2024
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు రెండు, మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరాదిలో పలు రైళ్లు కూడా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి.