Unnao Rape Case: ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించిన దిల్లీ కోర్టు, బాధితురాలికి పరిహారంగా రూ.25 లక్షలు ఇవ్వాలని ఆదేశం
ఈ కేసు కారణంగా బీజేపీ నాయకత్వం ఈ ఏడాది ఆగష్టులో కుల్దీప్ ను పార్టీ నుంచి బహిష్కరించింది....
New Delhi, December 20: ఉన్నావ్ అత్యాచారం, అపహరణ కేసు (Unnao Rape Case) లో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ (Kuldeep Singh Sengar) కు జీవిత ఖైదు (life imprisonment) శిక్ష విధిస్తూ దిల్లీలోని టిస్ హజారీ కోర్టు (Tis Hazari Court) శుక్రవారం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా బాధితురాలికి పరిహారంగా రూ. 10 లక్షలు, మరియు కోర్ట్ విచారణలకు సంబంధించి అదనంగా మరో రూ. 15 లక్షలు, మొత్తంగా రూ. 25 లక్షలు కుల్దీప్ సింగ్ చెల్లించాలని తీర్పులో పేర్కొంది.
అలాగే బాధితురాలికి గానీ, ఆమె కుటుంబానికి గానీ కుల్దీప్ సింగ్ కుటుంబం నుంచి ఏమైనా ముప్పు ఉందా సమీక్షించాలని సీబీఐని కోర్ట్ ఆదేశించింది. బాధిత కుటుంబానికి సురక్షిత నివాసం కూడా ఏర్పాటు చేసే బాధ్యతలను సీబీఐ తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో బాధిత యువతికి, ఆమె కుటుంబానికి సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీ
న్యాయమూర్తి నుంచి ఈ తీర్పు వెలువడగానే దోషి కుల్దీప్ సింగ్ కోర్ట్ హాలులో కన్నీళ్లు పెట్టుకుంటూ కూలబడిపోయాడు. కోర్టులో వాదనల సందర్భంగా ఈ కేసులో దోషికి శిక్షను తగ్గించే ఎలాంటి అంశాలు లేవని అన్నప్పుడు, సీబీఐ ప్రాసిక్యూటర్ అశోక్ భార్తేండు కల్పించుకొని దోషి పట్ల ఎలాంటి సానుభూతి చూపకుండా అతడికి గరిష్ఠ శిక్షను విధించాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు.
అయితే, ఈ సందర్భంగా న్యాయస్థానం సీబీఐకి కూడా అక్షింతలు వేసింది. 2018, ఏప్రిల్ లో ఉత్తరప్రదేశ్ పోలీసుల నుంచి ఈ కేసు దర్యాప్తును బదలాయించుకొన్న సీబీఐ, ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ఒక ఏడాది ఆలస్యం జరిగిందని సీబీఐని కోర్ట్ నిందించింది.
Here's the update:
ఈ అత్యాచారానికి సంబంధించిన కేసులో గత ఏడాది ఏప్రిల్ 13న కుల్దీప్ సింగ్ అరెస్టయ్యాడు, అప్పట్నించి తీహార్ జైలులో ఉన్నాడు. ఈ కేసు కారణంగా బీజేపీ నాయకత్వం ఈ ఏడాది ఆగష్టులో కుల్దీప్ ను పార్టీ నుంచి బహిష్కరించింది. కేసు నుంచి బయటపడేందుకు శతవిధాల ప్రయత్నించిన కుల్దీప్, బాధితురాలిని చంపేందుకు యాక్సిడెంట్ కుట్ర
2017లో బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి వివిధ ప్రదేశాలలో 9 రోజుల పాటు అత్యాచారం చేశారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో బంగార్‌మౌనియోజకవర్గానికి అప్పుడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధాన నిందితుడని చార్జిషీట్లో పేర్కొంటూ, ఏప్రిల్ 13, 2018లో అతణ్ని అరెస్ట్ చేసింది.
అనేక విచారణల అనంతరం ఇటీవల డిసెంబర్ 16న కుల్దీప్ సింగ్ ను దోషిగా తేల్చిన న్యాయస్థానం, ఈరోజు శిక్ష ఖరారు చేసింది.