Unnao Rape Case main accused Kuldeep Singh Sengar. (Photo Credits: PTI)

New Delhi, December 16: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు (Delhi's Tis Hazari Court) ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది. యువతిని కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన ఈ కేసులో(Unnao Rape Case) బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగర్‌ (former BJP MLA Kuldeep Singh Sengar) నిందితుడిగా ఉన్నారు.

ఇప్పటికే ఈ కేసులో వాదనలు పూర్తైన నేపథ్యంలో ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామంటూ తీస్ హజారీ కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 8న తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు సీఎం యోగి కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ కేసు వెలుగుచూసింది. ఈ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉంచారు.  మృగాళ్ల వేటలో మరో మహిళ మృతి

యూపీలోని బాంగర్‌మావ్‌ నుంచి సెంగర్‌ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అత్యాచారం ఆరోపణలు రావడంతో బీజేపీ.. ఆయణ్ని సస్పెండ్ చేసింది. కోర్టు కూడా ఆగస్టు 9న ఎమ్మెల్యేతో సహా సింగ్‌ పై కూడా సెక్షన్‌ 120 బీ, 363, 366 ,376 కింద చార్జిషీట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ఇదే సంవత్సరం జూలై 28న బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువులిద్దరు చనిపోయారు.

Check ANI tweet:

ఇది కావాలని చేసిన యాక్సిడెంటన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానిక కోర్టు ఎమ్మెల్యే, అతని సోదరుడు అతుల్‌ సహా మరో 9 మందిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం, తన గోడును వెళ్లబోసుకుంటూ బాధితురాలు రాసిన ఉత్తరంతో స్పందించిన అప్పటి చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా రంజన్‌గోగోయ్‌.. ఉన్నావ్‌ అత్యాచారానికి సంబంధించిన ఐదు కేసులను లక్నో కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించారు.

లక్నో కోర్టులో విచారణ కొనసాగుతున్న ఈకేసును సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఢిల్లీ కోర్టుకు బదిలీ చేశారు. ఆతర్వాత ఆగస్టు 5 నుంచి ఈ కేసులో రోజూవారి వాదనలు విన్న జిల్లా జడ్జ్‌ ధర్మేష్‌ శర్మ తీర్పును వెలువరించనున్నారు. మైనర్‌ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి, సెంగర్‌ అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరో వ్యక్తి శశి సింగ్‌ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు.

కారు యాక్సిడెంట్‌ తర్వాత ఎయిమ్స్‌ లో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలి నుంచి కూడా ప్రత్యేక కోర్టు స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం బాధిత యువతికి, ఆమె కుటుంబానికి సీఆర్‌పీఎఫ్‌ సెక్యూరిటీ కల్పించారు. ప్రస్తుతం వారు, ఢిల్లీ ఉమెన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలోని ఒక రెంటెడ్‌ నివాసంలో నివసిస్తున్నారు. ఇక 45 రోజులుగా వాదనలు విన్న స్పెషల్‌ కోర్టు.. ఈ కేసులో సోమవారం కీలక తీర్పు చెప్పనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అత్యాచారం చేయడమే కాకుండా..అంతం చేయాలని చూసే రాక్షసులకు ఎలాంటి శిక్ష పడాలి..దిశ కేసులో జరిగిన న్యాయం కంటే ఇప్పుడు అలాంటి కేసులలో కోర్టులెలా వ్యవహరించబోతున్నాయనే అంశం ఆసక్తి కలిగిస్తోంది.