Devara Movie Review: ఆరేళ్ల నిరీక్షణ, ఎట్టకేలకు బుడ్డోడి ఫ్యాన్స్ ఆకలి తీర్చిన కొరటాల, థియేటర్లలో పోటెత్తిన ఎర్రసముద్రం కెరటాలు, దేవర పార్ట్ 1 మూవీ రివ్యూ ఇదిగో..

ఇక కొరటాల ఆచార్య మూవీ జ్ఞాపకాల నుంచి బయటపడ్డాడా.. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంతో వచ్చిన ఈ మూవీ మరీ ప్రేక్షకులను ఆకట్టుకుందా ?

Devara Movie Telugu Review (photo-File Image)

Devara Movie Review in Telugu: జూనియర్ ఎన్టీఆర్‌-కొరటాల కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే.తాజాగా మరోసారి వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా దేవర. ఆరేళ్ల తర్వాత బుడ్డోడు (NTR) సోలో హీరోగా చేస్తుండటం, జాన్వీ (Janhvi Kapoor) ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమవుతుండటంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.మరి ‘దేవర’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కొరటాల ఆచార్య మూవీ జ్ఞాపకాల నుంచి బయటపడ్డాడా.. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంతో వచ్చిన ఈ మూవీ మరీ ప్రేక్షకులను ఆకట్టుకుందా ?

దేవర కథ : ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతాన్ని సినిమాలో చూపించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న ఓ కొండపై ఉన్న నాలుగు ఊళ్లని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఆ పేరు వెనక బ్రిటిష్ కాలం నాటి నుంచి చరిత్ర ఉంటుంది. ఆ నాలుగు ఊళ్ల అవసరాల కోసం దేవర (ఎన్టీఆర్‌), భైర (సైఫ్ అలీఖాన్‌) వాళ్ల అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతుంటారు. ఆ నౌకల నుంచే అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటుంది మురుగ (మురళీశర్మ) గ్యాంగ్.

కడపలో విషాదం, దేవర సినిమా చూస్తూ అభిమాని మృతి..సినిమా చూస్తూ కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన అభిమాని

సముద్రానికి ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమ జీవనానికే ముప్పు తీసుకొస్తున్నాయని గ్రహించిన దేవర (ఎన్టీఆర్)... ఇకపై ఆ పనుల్ని చేయకూడదనే నిర్ణయించుకుంటాడు. మనం బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, సముద్రం అందించే చేపలు పట్టడంపై దృష్టి పెడదామని భైరతో చెబుతాడు. అయితే భైర అందుకు ఒప్పుకోడు. అక్కడి నుంచి ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది.

 'దేవర' సినిమా ప్రదర్శనలో ఘర్షణ.. కడప రాజా థియేటర్ లో యువకుల వీరంగం.. సిబ్బందిని చితకబాదుతూ గలాటా (వీడియోతో)

దేవరని అడ్డు తొలగించుకుని సంద్రాన్ని భైర శాసించాలనుకుంటాడు. అయితే దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ భైర సంద్రం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తుంటాడు. ఆ భయం ఎన్నాళ్ల పాటు కొనసాగింది. అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన కొడుకు వర (ఎన్టీఆర్‌) ఏం చేశాడు? ఈ వరని ఇష్టపడిన తంగం (జాన్వీకపూర్) కథ ఏంటి ఇవన్నీ తెలియాలంటే థియేటర్ కు వెళ్లాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

బ్రిటిష్ కాలం నుంచీ ఎర్ర సముద్రానికి, అక్కడి జనాలకీ ఉన్న చరిత్ర, దానికి కాపలాగా ఉండే దేవర కథని సింగప్ప (ప్రకాశ్‌రాజ్‌)తో చెప్పిస్తూ కథని దర్శకుడు కొరటాల శివ నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా అంతా సముద్రం నేపథ్యంలో సాగడం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని అందిస్తుంది.సంద్రంలో ఉవ్వెత్తున ఎగసే కెరటంలాగే ఎన్టీఆర్ పాత్ర కూడా అమాంతం ఎగసిపడుతుంది.

నౌకలపైన కంటైనర్లని చాకచక్యంగా దొంగిలించడం, ఆ తర్వాత ఆయుధాల కోసం ఊళ్లో దేవర, భైర మధ్య సాగే భీకర పోరాటం తదితర సన్నివేశాలు ఎర్ర సముద్రంలో మనం కూడా ఉన్నామనే అనుభూతిని కలిగిస్తాయి. దర్శకుడు దేవర, భైర పాత్రలను తెరపై శక్తిమంతంగా ఆవిష్కరించాడు. ఫియర్ సాంగ్‌తో పాటు వచ్చే పోరాట ఘట్టాలు, విరామ సన్నివేశాలు సినిమాని అమాంతం ఎత్తిపడేస్తాయి. అయితే దేవర, భైర పాత్రల ముగింపు ఏమిటనేది రెండో భాగం కోసం అలానే ఉంచాడు దర్శకుడు శివ.

రత్నవేలు కెమెరా పనితనం, విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ పనితీరు సూపర్. నేపథ్య సంగీతంతో అనిరుధ్ సినిమాపై మంచి ప్రభావం చూపారు. పోరాట ఘట్టాల్ని డిజైన్ చేసిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. దేవరలోనూ ఇదే చెప్పాలని చూసాడు. కొరటాల శివ తన సినిమా మార్క్ ఎలా ఉంటుందనేది మరోసారి తెరపై ఆవిష్కరించారు. డైలాగ్స్ కొన్ని కట్టిపడేస్తాయి. ‘దేవర అడిగినాడంటే సెప్పినాడని, సెప్పినాడంటే..’ ‘భయం పోవాలంటే దేవుడి కథ వినాల, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాల..’, ‘సంద్రం ఎక్కాల, ఏలాల..’ ఇలాంటి మాటలు సినిమా చూసే వారికి ఈలలు వేసేలా చేస్తాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif