Telangana:మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలి, తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ సహా పలు నగరాలు కాలుష్య కాసారంగా మారాయని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు

This is Praja Palana says CM Revanth Reddy(X)

Hyd, Dec 3: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్‌ వేడుకల్లో సీఎం మాట్లాడారు.భాగ్యనగరం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీ సహా పలు నగరాలు కాలుష్య కాసారంగా మారాయని తెలంగాణ ముఖ్యమంత్రి  అన్నారు. మరో పదేళ్లు విస్మరించామంటే హైదరాబాద్‌ కుడా అలాగే అవుతుందని చెప్పారు. వాన పడితే రోడ్లన్నీ వరదమయం అవుతున్నాయని చెప్పారు.

రోడ్ల పక్కన వాటర్‌ హార్వెస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో వర్షానికి ట్రాఫిక్‌ నరకం లేకుండా ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణదారులకు హైడ్రాతో భయం పట్టుకుందని అన్నారు. మెట్రోకు రూ.35 వేల కోట్లు అవసరం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. న్యూయార్క్‌, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ.7వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఎస్‌టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయి, గ్రూప్ -1 ఉద్యోగుల పాపం మీదేనని బీఆర్ఎస్ మీద మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

మూసీ ప్రక్షాళనకు బీజేపీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటో చెప్పాలని నిలదీశారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలని అడిగారు. తాగునీటి ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు కావాలి.. ఎన్ని తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మూసీలో నిద్రపోతారో.. మోదీని తీసుకువస్తారో.. వాళ్ల ఇష్టం అని చెప్పారు. తెలంగాణకు మాత్రం కిషన్‌రెడ్డి నిధులు సాధించాలని అన్నారు. తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండిపడ్డారు. ఏడ్చే వాళ్ల గురించి తమకు బాధలేదని చెప్పారు. హైదరాబాద్‌ మునిగిపోతే మోదీ ఒక్క పేసా కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజా పాలన కోసం ఏడాది క్రితం ప్రజలు తీర్పు ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచాం. మెట్రోను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది కాంగ్రెస్సే. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్‌, రంగారెడ్డి నుంచే వస్తుంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణకే మణిహారం. రూ.35 వేల కోట్లతో 360 కి.మీ రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు ప్రయత్నిస్తున్నాం.

ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను నిర్మించబోతున్నాం. ఓఆర్ఆర్‌కు అనుబంధంగా ముచ్చర్ల ప్రాంతంలో ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తాం. 40 నుంచి 50 వేల ఎకరాల్లో అద్భుతంగా ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తాం. టోక్యో, న్యూయార్క్‌తో పోటీ పడేలా నిర్మిస్తాం. రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్‌ అద్భుత నగరం అవుతుంది’’ అని సీఎం తెలిపారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif