Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, రేపు ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా
11 రోజుల సస్పెన్స్ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ పేరునే బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక సీఎం పదవిని ఆశీంచిన షిండేను బుజ్జగించడంలో బీజేపీ సక్సెస్ అయింది. దీంతో ఇవాళ జరిగిన బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఫడ్నవీస్‌ను బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Delhi, Dec 4: మహారాష్ట్ర సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. 11 రోజుల సస్పెన్స్ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ పేరునే బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక సీఎం పదవిని ఆశీంచిన షిండేను బుజ్జగించడంలో బీజేపీ సక్సెస్ అయింది. దీంతో ఇవాళ జరిగిన బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఫడ్నవీస్‌ను బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి 288 స్థానాలకు గాను 230 గెలుచుకున్న సంగతి తెలిసిందే.బీజేపీ 148 స్థానాల్లో పోటీ చేసి 132 చోట్ల విజయం సాధించింది. అయితే శివసేన నేతలు ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. కూటమికి షిండేనే నాయకత్వం వహించారని ఆయనకే సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టారు.
దీంతో మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిని డిసైడ్ చేయడానికి స్వయంగా అమిత్ షా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అనేక తర్జనభర్జనల అనంతరం షిండేను బుజ్జగించడంలో బీజేపీ సక్సెస్ కావడంతో ఫడ్నవీస్ సీఎం కావడానికి మార్గం సుగుమమైంది. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం, సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు..వీడియో ఇదిగో
Here's Tweet:
ఇక రేపు ముంబైలోని ఆజాద్ మైదానంలో ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా హాజరుకానున్నారు. ఇవాళ గవర్నర్‌ను కలవనున్న ఫడ్నవీస్ ..ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరనున్నారు.