Telangana Encounter: దిశ నిందితుల మృతదేహాలకు మరోసారి పోస్ట్‌మార్టం, ఆదేశించిన తెలంగాణా హైకోర్టు, 23వ తేదీ సాయంత్రం అయిదు గంటలలోపు మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం చేయాలని ఆదేశాలు
నాలుగు మృతదేహాల అప్పగింతపై శనివారం న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కోర్టు పలు సూచనలు చేసింది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం అయిదు గంటలలోపు మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
Hyderabad, December 21: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసు (Disha Case) నిందితుల మృతదేహాలకు మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. నాలుగు మృతదేహాల అప్పగింతపై శనివారం న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కోర్టు పలు సూచనలు చేసింది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం అయిదు గంటలలోపు మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా పోస్ట్‌మార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని, కలెక్షన్స్ ఆఫ్ ఎవిడెన్స్‌ను సీల్డ్ కవర్‌లో భద్రపరచాలని తెలిపింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబాలు, రూ.50 లక్షలు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్రంతో (Telangana State) సంబంధం లేని నిపుణులతో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు, బుల్లెట్స్, గన్స్, ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం రిపోర్టులను భద్రపరచాలని, రీ పోస్ట్‌మార్టం పూర్తి అయిన తర్వాత పోలీసుల సమక్షంలో ఆ మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని పేర్కొంది.
దిశ నిందితులు మొత్తం 9 మందిని అదే తరహాలో కాల్చివేశారు
కాగా న్యాయస్థానం ఆదేశాలతో గాంధీ సూపరింటెండెంట్ శ్రావణ్ ఇవాళ విచారణకు హాజరు అయ్యారు. మృతదేహాలు యాభై శాతం కుళ్లిపోయాయని, ఫ్రీజర్‌లో ఉంచినప్పటికీ మరో వారం, పదిరోజుల్లో అవి పూర్తిగా కుళ్లిపోతాయని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
ANI Tweet
ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ కేసు నిందితుల మృతదేహాల విషయం ఎటూ తేలడం లేదు. మృతదేహాల అప్పగింత వ్యవహారం కొలిక్కి రావడం లేదు. మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని కొందరు కోర్టుకెళ్లారు. అయితే ఎన్ కౌంటర్ కు సంబంధించి కేసు విచారణ కొనసాగుతుండటంతో కోర్టు ఆదేశాలతో డెడ్ బాడీలను గాంధీ ఆసుపత్రిలోని ఫ్రీజర్ లోనే పెట్టి భద్రపరుస్తున్నారు. అయితే ఇకపై ఫ్రీజర్ లో శవాలను దాచే పరిస్థితి లేకుండా పోయింది. డెడ్ బాడీలు కుళ్లిపోయే స్థితికి వచ్చాయి. ఈ నేపథ్యంలో మళ్లీ రీ పోస్ట్ మార్టం చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.