Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, December 19: దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ (Disha Case Encounter)  కాబడిన నలుగురు నిందితులకు చెందిన కుటుంబాలు (Familes of 4 accused)  సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ ఎన్‌కౌంటర్ పై స్వతంత్ర దర్యాప్తును చేపట్టాలని, అందుల్లో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మొత్తం నలుగురు నిందితులకు చెందిన కుటుంబ సభ్యులు గురువారం సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదొక బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపిస్తూ, పోలీసులు సాక్షులను ప్రభావితం చేసి సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నాయకత్వం వహించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అలాగే తమ నాలుగు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు చొప్పున నష్టపరిహారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని డిమాండ్ చేశారు. దిశ తరహాలోనే మరికొంత మందిపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులు 

ఈ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కోసం సుప్రీంకోర్ట్ ఇప్పటికే  ముగ్గురు సభ్యులతో కూడిన కమీషన్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి.ఎస్.సర్పూర్కర్ నేతృత్వంలో రిటైర్డ్ బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి రేఖా బల్డోటా, మాజీ సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ, విచారణ ప్రారంభించిన 6 నెలల్లో ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన సమగ్ర నివేదికను తమకు అందజేయాలని ఆదేశించింది.

దీనిపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఈ ఎన్‌కౌంటర్‌పై ఏ ఇతర కోర్టులు లేదా దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దిశ నిందితుల కుటుంబాలను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంది.