Disha Rape-Murder Case: దిశ నిందితులు మొత్తం 9 మందిని అదే తరహాలో కాల్చివేశారు, మరెంతో మందిని లైంగికంగా వేధించారు, పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్న షాకింగ్ విషయాలు
File Image of Disha Case Encounter Accused Four | File Photo

Hyderabad, December 18: నవంబర్ 27న హైదరాబాద్ శివారులో జరిగిన యువ వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం- హత్య (Disha rape-murder) ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత వారం రోజులకే ఆ నలుగురు నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్ (Encounter) లో హతమయ్యారు. అయితే దిశ నిందితులకు సంబంధించి షాకింగ్ విషయాలను పోలీసులు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం ఆ నరరూప రాక్షసుల బారిన పడి దారుణానికి గురైంది కేవలం దిశ ఒక్కర్తే కాదు, మరో 9 మందిని ఇదే తరహాలో అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. దిశ కేసులో ఎ1 -మహ్మద్ ఆరిఫ్, ఎ2- జొల్లు శివ, ఎ3 జొల్లు నవీన్ మరియు ఎ4 గా చింతకుంట చెన్నకేశవులు ఉన్నారు. వీరిలో ఎ1 మరియు ఎ4లు అయిన మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు కరుడుగట్టిన నేరగాళ్లని తేలింది. నగరం నిద్రపోతున్న వేళ అరణ్య రోదనే అయిన ఆమె ఆర్తనాదాలు, మంటల్లో కలిసిన ఆమె దివ్యమైన తేజస్సు

తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో దిశ తరహాలో సామూహిక అత్యాచారానికి గురికాబడి, పెట్రోల్ తో దహనం చేసిన 15 కేసులకు సంబంధించి ఆ నలుగురు నిందితులను పోలీసులు ప్రశ్నించినపుడు అందులో 9 తామే చేసినట్లు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు (Arif & Chennakeshavulu) అంగీకరించారని సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. వారి ప్రతీ కేసును క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నామని, ఆ సంఘటనలు జరిగిన ప్రదేశాలకు ఇప్పటికే తమ టీమ్స్ వెళ్లాయని తెలియజేశారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ విచారణకు సంబంధించి రిటైర్డ్ జడ్జ్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో సుప్రీంకోర్ట్ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి పోలీసులు వెల్లడిస్తున్న వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. కుళ్లిపోతున్న నలుగురు నిందితుల మృతదేహాలు, దిల్లీ ఎయిమ్స్‌కు తరలించేందుకు ఏర్పాట్లు

కర్ణాటక- తెలంగాణ సరిహద్దు వెంబడి మహబూబ్‌నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి హైవేల వెంబడి ఒంటరిగా దొరికిన ఎంతో మందిని ఆరిఫ్, చెన్నకేశవులు లైంగిక వేధింపులకు గురిచేశారు. మహిళలనే కాదు, ట్రాన్స్ జెండర్లను, వేశ్యలను కూడా వేధింపులకు గురిచేశారు. అయితే అందులో 9 మంది మహిళలపై అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసుల ఇంటరాగేషన్ లో వెల్లడైంది. ఆ ఇద్దరు వాడిన మొబైల్స్ మరియు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఘటనాప్రదేశాలను ట్రేస్ చేస్తున్నారు.

దిశ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇప్పటికే అందుకున్న పోలీసులు, నిందితుల నేరాలకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కలిపి త్రిసభ్య కమిటీకి సమర్పించనున్నారు.