Nagpur Shocker: దీపావళి బోనస్‌ ఇవ్వలేదని ఓనర్‌ను హత్యచేసిన వర్కర్లు, మెడకు తాగు బిగించి, బండరాయితో కొట్టి చంపిన పనివాళ్లు

దీపావళికి బోనస్‌ (Diwali Bonus) డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు ధాబా వర్కర్లు తమ యజమానిని కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడిని మాజీ సర్పంచ్‌ రాజు ధెంగ్రేగా పోలీసులు గుర్తించారు.

Representational Purpose Only (File Image)

Nagpur, NOV 12: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో (Nagpur) ఘోరం చోటుచేసుకుంది. దీపావళికి బోనస్‌ (Diwali Bonus) డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు ధాబా వర్కర్లు తమ యజమానిని కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడిని మాజీ సర్పంచ్‌ రాజు ధెంగ్రేగా పోలీసులు గుర్తించారు. నాగ్‌పుర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుహి ఫటా సమీపంలోని ధాబాలో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరూ మధ్యప్రదేశ్‌లోని మండ్లాకు చెందిన ఛోటు, ఆదిగా గుర్తించారు. దాదాపు నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని ఓ లేబర్‌ కాంట్రాక్టర్‌ ద్వారా వీరిద్దరినీ రాజు ధెంగ్రే తన ధాబాలో వర్కర్లుగా చేర్చుకున్నారు. అయితే, ఇటీవల యజమానితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో నిందితులిద్దరూ తమకు దీపావళి బోనస్‌ అడగడం వల్ల ఈ విభేదాలు తలెత్తినట్లు (Diwali 2023 Bonus Denied) పోలీసులు గుర్తించారు. అయితే, వాళ్లకు ఇంకెదైనా రోజు డబ్బులు ఇస్తానని ధెంగ్రే అంగీకరించినట్లు సమాచారం.

Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, శృంగారానికి ఒప్పుకోలేదని బాలుడిని దారుణంగా చంపిన మరో యువకుడు, చెరకు తోటలో మృతదేహం 

అయితే అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో యజమానిని హతమార్చాలని కుట్ర పన్నిన నిందితులు.. అదేరోజు రాత్రి భోజనం అయ్యాక ధెంగ్రే నిద్రపోతున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. ధెంగ్రే నిద్రపోతుండగా.. మెడకు తాడును బిగించి,  తలపై బండరాయితో కొట్టడంతో పాటు పదునైన ఆయుధంతో దాడిచేసి అతడి ముఖాన్ని ఛిద్రం చేశారు(Workers Brutally Murders Owner). ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం ధెంగ్రే మృతదేహాన్ని ఓ బొంతలో కప్పి నిందితులిద్దరూ అతడి కారులోనే అక్కడినుంచి పరారయ్యారు.

Teacher Sex With Student: అమెరికాలో దారుణం, 14 ఏళ్ల విద్యార్థికి గంజాయి తాగించి టీచర్ సెక్స్, గదికి తీసుకు వెళ్లి 20 సార్లకు పైగా శ‌ృంగారం, నిందితురాలు అరెస్ట్ 

అయితే, విహార్‌ గావ్‌ సమీపంలోని నాగ్‌పుర్‌-ఉమ్రెడ్‌ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టడంతో నిందితులిద్దరికీ గాయాలయ్యాయి. దీంతో కారు దిగి దిఘోరి వైపు పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. మరోవైపు, ధెంగ్రే కుమార్తె తన తండ్రికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో పక్కనే వున్న పాన్‌ దుకాణం నిర్వాహకుడికి ఫోన్‌ చేయగా.. అతడు అక్కడికి వెళ్లి చూసేసరికి ధెంగ్రే రక్తపుమడుగులో కనిపించడం చూసి షాక్‌ అయ్యాడు. అయతే, ఈ దారుణానికి ఆర్థికపరమైన వ్యవహారమే కారణంగా కనిపిస్తోందని.. కాకపోతే అతడు మాజీ సర్పంచ్‌, స్థానికంగా పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.



సంబంధిత వార్తలు