Coins in Man Stomach: వామ్మో! కిలోన్నర కాయిన్స్ మింగిన వ్యక్తి, ఆపరేషన్ చేసి 187 నాణేలను బయటకు తీసిన డాక్టర్లు, మానసికవ్యాధి కారణంగానే మింగినట్లు గుర్తింపు
దాంతో అతన్ని బాగల్‌కోట్‌లోని (Bagalkot) వైద్యులకు చూపించగా వారు ఆయనకు ఎక్స్‌రే, ఎండోస్కోపీ నిర్వహించారు. ఎండోస్కోపీలో కడుపులో నాణేల ఆకారంలో ఉన్న వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆయనకు గ్యాస్ట్రోటమీ శస్త్రచికిత్స (Surgery) చేపట్టి 187 నాణేలను బయటకు తీశారు.
Bagalkot, NOV 30: కొందరికి చిరుతిండ్లు తినే అలవాటు ఉంటుంది. మరికొందరికి చాటుగా బలపాలు తినే అలవాటు కూడా ఉంటుంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం కాయిన్స్ (Coins) తినే అలవాటుంది. మానసిక వ్యాధితో బాధపడుతున్న అతను ప్రతిరోజు కాయిన్స్ మింగుతున్నాడు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్ చేసి కిలోన్నర బరువున్న కాయిన్స్‌ను తొలగించారు. ఎక్స్‌రే (X ray), ఎండోస్కోపీ చేసిన డాక్టర్లు అతని కడుపులో కాయిన్స్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి, వాటిని తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాయచూర్ జిల్లాలోని లింగసుగూర్ పట్టణానికి చెందిన దయమప్ప హరిజన్ (Dyamappa Harijan) అనే 58 ఏళ్ల వ్యక్తి గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. వాంతులు చేసుకుంటున్న దయమప్ప కడుపు బెలూన్ మాదిరిగా ఉబ్బంది. దాంతో అతన్ని బాగల్‌కోట్‌లోని (Bagalkot) వైద్యులకు చూపించగా వారు ఆయనకు ఎక్స్‌రే, ఎండోస్కోపీ నిర్వహించారు. ఎండోస్కోపీలో కడుపులో నాణేల ఆకారంలో ఉన్న వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆయనకు గ్యాస్ట్రోటమీ శస్త్రచికిత్స (Surgery) చేపట్టి 187 నాణేలను బయటకు తీశారు.
ఐదుగురు డాక్టర్ల బృందం దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి దయ్యప్ప కడుపులో నుంచి మొత్తం నాణేలను తొలగించింది. ఇందులో ఐదు రూపాయల నాణేలు, రెండు రూపాయల నాణేలు, ఒక్క రూపాయి నాణేలు ఉన్నాయి. ఈ నాణేల మొత్తం విలువ 462 రూపాయలు. వీటి బరువు 1.2 కిలోలుగా తేలింది.
తమ తండ్రి మానసికంగా ఆరోగ్యంగా లేరని, ఆయన స్కిజోఫ్రెనియా వ్యాధితో (psychiatric illness) బాధపడుతున్నట్లు ఆయన కుమారుడు రవికుమార్ పేర్కొన్నారు. నాణేలు మింగినట్లు ఎవరికీ చెప్పలేదన్నారు. మూడు రోజుల క్రితం కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.