Dombivli Murder: కామంతో కళ్లు మూసుకుపోయి ప్రాణ స్నేహితుడి భార్యనే.. ఎదురు తిరిగేసరికి కింద పడేసి మెడకు తాడు బిగించి హత్య, సోఫాలో మహిళ మృతదేహం కేసును చేధించిన ముంబై పోలీసులు

మహిళను హత్య (Dombivli Murder) చేసి సోఫా కమ్‌ బెడ్‌లో కుక్కేసి వెళ్లిని నిందితుడిని పోలీసులు అరెస్ట్ (Neighbour arrested) చేశారు. ఈ కేసును చేధించడంలో నిందితుడి చెప్పులే కీలకంగా వ్యవహరించాయి.

(Photo Credit: PTI)

Mumbai, Feb 19: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కలకలం రేపిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. మహిళను హత్య (Dombivli Murder) చేసి సోఫా కమ్‌ బెడ్‌లో కుక్కేసి వెళ్లిని నిందితుడిని పోలీసులు అరెస్ట్ (Neighbour arrested) చేశారు. ఈ కేసును చేధించడంలో నిందితుడి చెప్పులే కీలకంగా వ్యవహరించాయి. హతురాలు భర్త క్లోజ్ స్నేహితుడే ఈ దారుణానికి ( woman’s murder in Mumbai Dombivli ) ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడు తన స్నేహితుడి భార్యనే చెరపట్టాలని చూడగా..ఆమె ప్రతిఘటించడంతో ఈ కిరాతకానికి పాల్పడినట్లు మాన్‌పాడా పోలీసులు (Manpada Police) తెలిపారు.

సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసులో దర్యాప్తు కష్టతరంగా మారింది. అయితే ఘటన జరిగిన రోజున(మంగళవారం), అంతకు ముందు రోజు నిందితుడు బాధితురాలి ఇంటి బయట చెప్పులు విడిచాడు. మరో పక్కింట్లో ఉండే మహిళ ఆ చెప్పుల ఆనవాళ్లు వివరించగా.. ఆ చిన్న క్లూతో నిందితుడిని ట్రేస్‌ చేయడం మొదలుపెట్టారు. అవి సుప్రియ భర్త కిషోర్ ఫ్రెండ్‌‌, పక్కఇంట్లో ఉండే విశాల్‌కి చెందినవిగా తేలడంతో.. తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. దీంతో నిందితుడు నిజం ఒప్పేసుకున్నాడు.

థానేలో దారుణం, మహిళ గొంతు నులిమి, తలను బాది హత్య చేసిన అగంతకులు, కనపడకుండా మహిళ మృతదేహాన్ని సోఫా బెడ్‌ లోపల దాచేశారు., కేసు నమోదు చేసుకున్న పోలీసులు

నిందితుడు విశాల్‌, మాన్‌పాడా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు విశాల్‌, హతురాలు సుప్రియ భర్త కిషోర్‌ షిండేలు చాలాకాలం నుంచి స్నేహితులు. అయితే స్నేహితుడి భార్యపైనే విశాల్ కన్నేశాడు. ఇందులో భాగంగానే కావాలనే కిషోర్‌ వాళ్ల పక్కింట్లోనే అద్దెకు దిగాడు. ఎలాగైనా సుప్రియను లోబర్చుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఆమె అతన్ని పట్టించుకోలేదు. సుప్రియకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఆ వంకతో ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు.

స్కూలులో కామాంధుడుగా మారిన టీచర్, 13 మంది విద్యార్థినులపై దారుణంగా అత్యాచారం, గర్భం దాల్చిన ఎనిమిది మంది, నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన ఇండోనేషియా కోర్టు

ఘటన జరిగిన ముందురోజు కూడా పుస్తకం కోసం సుప్రియ ఇంట్లోకి వెళ్లాడు విశాల్‌. ఆ టైంకి సుప్రియ భర్త ఆఫీసుకి, కొడుకు స్కూల్‌కి వెళ్లడం గమనించాడు. ఆ మరుసటి రోజూ సుప్రియ ఒంటరిగా ఉన్న టైంలో తలుపు తట్టాడు. పుస్తకం కావాలంటూ సుప్రియతో మాటలు కలిపి తన కోరికను బయటపెట్టాడు. దీంతో ఆమె అతని చెంప చెల్లుమనిపించింది. తట్టుకోలేక పోయిన నిందితుడు కోపంతో ఆమెను బలవంతం చేయాలని ప్రయత్నించాడు. ప్రతిఘటించేసరికి తల నేలకేసి బాది.. ఆపై నైలాన్‌ తాడును సుప్రియ మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు.

ఎంత రసికుడవయ్యా..7 రాష్ట్రాల్లో 14 మందిని పెళ్లి చేసుకున్న ఘనుడు, కొన్ని రోజులు కాపురం చేసి ఆ తర్వాత జంప్, ఈ గురుడు వలలో చిక్కుకుంది కూడా బడా మహిళా ఆఫీసర్లే మరి

ఆపై శవాన్ని సోఫా కమ్‌ బెడ్‌లో కుక్కేసి.. అక్కడి నుంచి జారుకున్నాడు. కొడుకును స్కూల్‌ నుంచి తీసుకెళ్లేందుకు ఆమె ఎంతకీ రాకపోవడంతో.. సుప్రియ కోసం కుటుంబ సభ్యులు వెతుకులాట మొదలైంది. కుటుంబ సభ్యులంతా సుప్రియ కోసం గాలిస్తున్న టైంలోనూ ఏమీ ఎరగనట్లు కిషోర్‌ పక్కనే ఉన్నాడు విశాల్‌. సుప్రియ ఎంతకీ కనిపించకపోయేసరికి కిషోర్‌తో కలిసి మరీ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి మిస్సింగ్‌ కంప్లయింట్‌ ఇచ్చి వచ్చాడు. ఈ లోపు సోఫా కుషన్‌ చినిగి ఉండడం అనుమానించిన చుట్టుపక్కల వాళ్లు.. పైకి ఎత్తి చూడగా అందులో నుంచి సుప్రియ షిండే మృత దేహం బయటపడింది.