Bhubaneswar, Feb 15: ఒడిశాలో ఓ వ్యక్తి ఏకంగా 7 రాష్ట్రాల్లో 14 మందిని పెళ్లి చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని ఇలా ఏకంగా 14 మంది మహిళలను పెళ్లి చేసుకుని వారి వద్ద నుంచి భారీగా డబ్బులను గుంజాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. వైరల్ కథనంలోకి వెళితే.. ఒడిశాలోని కేంద్రపర జిల్లాకు చెందిన బిధు ప్రకాష్ స్వైన్(54) అనే వ్యక్తి తనను తాను డాక్టర్‌గా చెప్పుకుంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడు.
ఇతను (Bibhu Prakash Swain) ఒడిశాలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా నివసిస్తుంటాడు. పంజాబ్, ఢిల్లీ, అస్సాం, జార్ఖండ్, ఒడిశాలకు చెందిన మహిళను తన వలలోకి దింపి రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. మధ్య వయసున్న మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలను ఇతను టార్గెట్ (Man Held For Marrying 14 Women In 7 States) చేసేవాడు. కేంద్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగినని చెబుతూ మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా మహిళలకు ఎర వేస్తుంటాడు. అంతేగాక బాగా చదువుకొని ఉన్నావారు, ప్రవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వారిని మాత్రమే సంప్రదిస్తాడు. ఇలా వారిని వంచించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయిన తర్వాత కొద్దిరోజులు వారి వద్దే ఉండి తరువాత ఏదైనా పని నిమిత్తం భువనేశ్వర్‌కు వెళతాననే నెపంతో మహిళలను తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లేవాడు.
అయితే జులై 2021లో ఢిల్లీకి చెందిన ఓ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూఢిల్లీలోని ఆర్యసమాజ్ ఆలయంలో స్వైన్ (Odisha man cheats women) తనను పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు భువనేశ్వర్‌లోని ఖండగిరి ప్రాంతంలోని ఓ ఇంట్లో అతన్ని (sexagenarian) అరెస్టు చేశారు. పోలీసుల విచారణలోనూ నిందితుడు షాకింగ్ నిజాలు వెల్లడించాడు. తను వివిధ మ్యాట్రిమోనియల్ సైట్లు మరియు సోషల్ మీడియాలో పరిచయమైన మరో 13 మంది మహిళలను మోసగించినట్లు తేలింది.
Here's ANI Tweet
A 54-year-old man in #Odisha was arrested for duping several women across the country after marrying them, the police said.
The individual has been identified as Ramesh Chandra Swain a.k.a Bidhu Prakash Swain a.k.a Ramani Ranjan Swain, a resident of Odisha's Kendrapara district. pic.twitter.com/E6TxK4a2Ho
— IANS Tweets (@ians_india) February 14, 2022
నిందితుని నుంచి 11 ఏటీఎం కార్డులు, 4 ఆధార్ కార్డులు, స్కూల్ సర్టిఫికెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామనీ నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు స్వైన్ గతంలో హైదరాబాద్‌లోనూ అరెస్టయ్యాడు. అతను సెంట్రల్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా నటిస్తూ దేశమంత అనేక మంది వ్యక్తుల నుండి రూ.2 కోట్ల మేరకు వసూలు చేశాడు. అలాగే కేరళలోని ఎర్నాకులంలో ఓకేసులోనూ అరెస్టయ్యాడు.
స్వైన్ బాధితుల్లో సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది, సీనియర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నారు. 2018లో పంజాబ్‌కు చెందిన సీఏపీఎఫ్ అధికారిని పెళ్లి చేసుకుని దాదాపు రూ.10 లక్షల మేర మోసం చేశాడు. అనంతరం గురుద్వారాకు చెందిన మహిళను పెళ్లి చేసుకొని ఆసుపత్రి మంజూరు చేస్తానని చెప్పి రూ.11 లక్షలను మోసం చేశాడు. అయితే స్వైన్ ఐదుగురు పిల్లలకు తండ్రి కాగా అతను 1982లో మొదటి సారి వివాహం చేసుకున్నాడు. అప్పటితో మొదలైన ఆయన పెళ్లి బాగోతలు 20 ఏళ్ల వరకు కొనసాగాయి. ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఎంతో మంది మహిళలతో స్నేహం చేసి వారిని దొంగ వివాహం చేసుకున్నాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఇతగాడు రమేష్ చంద్ర స్వైన్, రమణి రంజన్ స్వైన్, బిదు ప్రకాష్ స్వైన్ ఇలా రకరకాల పేర్లతో చెలామణి అయ్యాడు.