2024 US Elections Results: దూసుకుపోతున్న ట్రంప్, మరో 31 ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠం సొంతం, రెండు యుద్దభూముల్లో జెండా పాతిన రిపబ్లికన్ పార్టీ

ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మరియు డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది

US Election Results LIVE Updates

Donald Trump US Election Results LIVE Updates: 2024 ఎన్నికలలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మరియు డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. నార్త్ కరోలినా తర్వాత 2వ యుద్ధభూమి రాష్ట్రమైన జార్జియాను ట్రంప్ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు CNN నివేదించింది. ఓహియోని కూడా డొనాల్డ్ ట్రంప్ స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం అధ్యక్ష పీఠానికి మరో 31 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 24 రాష్ట్రాలను రిపబ్లికన్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ రాష్ట్రాలలో మొత్తం 239 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అధ్యక్ష రేసులో గెలుపొందాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే ట్రంప్ 239 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. స్వింగ్ స్టేట్లలో లీడ్ లో ఉండడంతో ట్రంప్ గెలుపు లాంఛనమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్న ట్రంప్, 17 రాష్ట్రాల్లో గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్, 177 సీట్లు ఎలక్టోరల్ సీట్లు కైవసం చేసుకున్న ట్రంప్

ఏడు స్వింగ్ స్టేట్లలో ట్రంప్ (Donald Trump) ఇప్పటికే జార్జియాను గెలుచుకున్నారు. వీటిలోనూ అత్యంత కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రంలో ట్రంప్ లీడ్ లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియాలో గెలిచిన అభ్యర్థి పార్టీనే అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంది. గడిచిన పన్నెండు అధ్యక్ష ఎన్నికల్లో పది ఎన్నికల్లో పెన్సిల్వేనియాలో గెలిచిన పార్టీనే అమెరికాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ (Kamala Harris) కేవలం 179 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే ఇప్పటి వరకు గెలుచుకోగలిగారు.

జార్జియా అధ్యక్ష రాజకీయాలలో సాపేక్షంగా కొత్త యుద్ధభూమి రాష్ట్రం మరియు 2020లో అధ్యక్షుడు జో బిడెన్‌కి వైట్‌హౌస్ విజయాన్ని అందించడంలో సహాయపడింది. బిడెన్ కేవలం 11,779 ఓట్ల తేడాతో గెలుపొందడంతో దాదాపు 30 ఏళ్లలో జార్జియా మొదటిసారిగా నీలి రంగులోకి మారిపోయింది. ఇక దేశంలో అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లున్న కాలిఫోర్నియా (54)లో కమలా హారిస్ విజయం ఖరారైనట్లు మీడియా సంస్థలు వెల్లడించడం డెమోక్రట్లకు భారీ ఊరట కలిగించింది. కాలిఫోర్నియాలో కమలా హారిస్‌ విజయం సాధించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్‌ ప్రెస్‌ (AP) ప్రకటించింది. ఓట్‌కాస్ట్‌ (AP VoteCast) పేరుతో నిర్వహించిన ముందస్తు సర్వేలో 15శాతం పాయింట్ల ఆధిక్యంలో ఉన్న అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఏపీ ఈ సర్వే నిర్వహించింది. ఇక్కడి సెనెట్‌ స్థానం, ప్రతినిధుల సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలోనూ డెమోక్రటిక్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

గోల్డెన్‌ స్టేట్‌గా పేరుగాంచిన కాలిఫోర్నియా (California Elections)ను అధ్యక్ష ఎన్నికల్లో కీలక రాష్ట్రంగా భావిస్తారు. ఇక్కడ కమలాహారిస్‌ గెలుస్తారని సర్వేలు ముందుగానే అంచనా వేశాయి. ఇక్కడ రిపబ్లికన్లతో పోలిస్తే నమోదిత డెమోక్రట్ల సంఖ్య చాలా ఎక్కువ. రాష్ట్రస్థాయిలోనూ, కాంగ్రెస్‌లోనూ డెమోక్రట్‌ ప్రతినిధుల ప్రాతినిధ్యం అధికంగా ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల్లో 1988 నుంచి ఏ రిపబ్లికన్‌ అభ్యర్థి కూడా కాలిఫోర్నియాలో విజయం సాధించలేదు. రెండున్నర దశాబ్దాల నుంచి రిపబ్లికన్లు ఇక్కడ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు. గతంలో అటార్నీ జనరల్‌గా, యూఎస్‌ సెనెటర్‌గా కాలిఫోర్నియా నుంచి ప్రాతినిధ్యం వహించిన కమలా హారిస్‌కు స్థానికంగా మంచి పట్టుంది.

పెన్సిల్వేనియాలో ఓటింగ్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్న వేళ.. అక్కడ భారీ మోసం జరిగిందని ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో ఆరోపించారు. అక్కడ చీటింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, తన ఆరోపణలకు సంబంధించి ట్రంప్ ఎలాంటి ఆధారాలు చూపలేదు.

రిపబ్లికన్లు గెలుచుకున్న రాష్ట్రాలు..

కెంటకీ, ఇండియానా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఒక్లహోమా, మిస్సోరి, టెక్సస్, జార్జియా, ఇడాహో, నార్త్ కరోలినా, నార్త్ డకోటా, అయోవా, సౌత్ డకోటా, లూసియానా, ఓహియో, వయోమింగ్, నెబ్రస్కా, టెనెస్సీ, అలబామా, మిసిసిపి, వెస్ట్ వర్జీనియా, అర్కన్సాస్, మోంటానా, యుటా



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif