Dry Day in Delhi: మందు బాబులకు షాక్, ఆరు రోజుల పాటు మద్యం అమ్మకాలను నిషేధించిన ఢిల్లీ సర్కారు, వరుస పండగల నేపథ్యంలో కీలక నిర్ణయం
గతంలో ఉన్న ఎక్సైజ్ విధానాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గణతంత్ర దినోత్సవం, ఇతర పండుగ రోజుల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సోమవారం జనవరి 26 నుండి మార్చి 31 మధ్య ఆరు రోజుల మ్యదం అమ్మకాలు ఆపేసినట్లు ప్రకటించింది. గతంలో ఉన్న ఎక్సైజ్ విధానాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు జాతీయ సెలవులు-- రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి- నాడు హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లలో మద్యం సేవించడాన్ని ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది.
గణతంత్ర దినోత్సవం, గురు రవిదాస్ జయంతి, స్వామి దయానంద సరస్వతి జయంతి, మహా శివరాత్రి, హోలీ, రామ నవమి రాబోయే రోజులలో ఉండటంతోఈ రోజుల్లో కూడా మద్యం అమ్మకాలు నిషేధించింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ నోట్ విడుదల చేసింది.
ఈ నోట్ ప్రకారం ఫిబ్రవరి 5న గురు రవిదాస్ జయంతి, ఫిబ్రవరి 15న స్వామి దయానంద్ సరస్వతి జయంతి, ఫిబ్రవరి 18న మహా శివరాత్రి, మార్చి 30న రామనవమి. రిపబ్లిక్ డే (జనవరి 26) నాడు బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలు కూడా నిషేధించబడ్డాయి.