Earthquake in MP: దేశాన్ని వణికిస్తున్న వరుస భూకంపాలు, తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం, తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు
ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో భూమికంపించిన సంగతి విదితమే. తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది.
Bhopal, Mar 24: దేశాన్ని వరుస భూకంప ప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో భూమికంపించిన సంగతి విదితమే. తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో (Gwalior) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
గ్వాలియర్‌కు 28 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కూడా భూమి కంపించింది.ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్ తెలిపింది. అంబికాపూర్‌లో (Ambikapur) ఆరు సెకన్ల పాటు భూమి కంపించిందని వెల్లడించింది. దీని ప్రభావంతో ప్రజలు ఇండ్ లనుంచి బయటకు పరుగులు తీశారని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.