Earthquake In Delhi: దేశ రాజధానిలో భూకంపం, వణికిన ఉత్తర భారతం, ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన ప్రజలు, ఆఫ్గనిస్తాన్‌లోని హిందూ కుష్ రీజియన్ ప్రాంతంలో కేంద్రీకృతమైన భూకంపం
ఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతం, (northern India)పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ సరిహద్దులో భూమి కంపించింది. ఢిల్లీలో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.3గా నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
New Delhi, December 20: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలు(earthquake) స్థానికులను వణికించాయి. ఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతం, (northern India)పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ సరిహద్దులో భూమి కంపించింది. ఢిల్లీలో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.3గా నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
ఆఫ్గనిస్తాన్‌లోని హిందూ కుష్ రీజియన్ ప్రాంతంలో భూకంపం (Hindu Kush region of Afghanistan) కేంద్రీకృతమైంది. భూకంపం వల్ల ఓ ఇంట్లో పైకప్పుకు ఉన్న ఫ్యాన్, షాండ్లియర్లు ఊగిపోయాయి. ఉత్తర ప్రదేశ్‌లోని మధురా, లక్నో, ప్రయాగ్‌రాజ్‌లతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో సైతం స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకోవడంతో స్థానికలు ఆందోళనకు గురయ్యారు. పాకిస్తాన్‌లోని లాహోర్ ప్రాంతంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
Video of the Earthquake in Lahore:
కాగా భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరింగిందన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏం జరుగుతుందో తెలియకపోవడంతో జనాలు ఒక్కసారిగా ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసారు. అయితే ఇప్పటివరకు, భూకంపంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు. దీనిపై మరింత
సమాచారం తెలియాల్సి ఉంది.