Mayan Calendar: తూచ్..అంతా ఫేక్, మరోసారి తప్పు చెప్పిన మాయన్ క్యాలెండర్, జూన్ 21 యుగాంతం అనేది అంతా అబద్దమే, 2012లో కూడా పుకారు లేపిన మయాన్ క్యాలెండర్
అయితే అదంతా ఒట్టిదే అని తేలిపోయింది. సూర్య గ్రహణం 2020, కరోనావైరస్ (Coronavirus) నేపథ్యంలో ప్రపంచంలోని పలు ప్రాంతాల నుండి చూసిన రింగ్ ఆఫ్ ఫైర్ వంటి అసాధారణ సంఘటనలు జరిగాయే కాని ఎక్కడా యుగాంతం ఆనవాళ్లు కానరాలేదు. ఇదిలా ఉంటే మాయన్ క్యాలెండర్ (Mayan Calendar) ప్రపంచం అంతం గురించి తప్పుగా అంచనా వేయడం ఇది రెండవసారి.
Mumbai, June 22: జూన్ 21, 2020న ప్రపంచం అంతమవుతుందని (End of the world) సోషల్ మీడియాలో నిన్న పుకార్లు బాగా హల్ చల్ చేసిన సంగతి విదితమే. అయితే అదంతా ఒట్టిదే అని తేలిపోయింది. సూర్య గ్రహణం 2020, కరోనావైరస్ (Coronavirus) నేపథ్యంలో ప్రపంచంలోని పలు ప్రాంతాల నుండి చూసిన రింగ్ ఆఫ్ ఫైర్ వంటి అసాధారణ సంఘటనలు జరిగాయే కాని ఎక్కడా యుగాంతం ఆనవాళ్లు కానరాలేదు. ఇదిలా ఉంటే మాయన్ క్యాలెండర్ (Mayan Calendar) ప్రపంచం అంతం గురించి తప్పుగా అంచనా వేయడం ఇది రెండవసారి. ఈ రోజుకు ఎన్నో ప్రత్యేకతలు! ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఒకేసారి మోసుకొచ్చిన 2020 సంవత్సరపు జూన్ 21, నేటి తేదీతో ముడిపడి ఉన్న కొన్ని ముఖ్యమైన దినోత్సవాలను తెలుసుకోండి
అంతకుముందు, క్యాలెండర్ డిసెంబర్ 21, 2012 లో ప్రపంచం అంతం అవుతుందని ఊహించింది. ఇది కూడా ఒక బూటకమని నిరూపించబడింది. ఈసారి, కుట్ర సిద్ధాంతకర్తలు (conspiracy theorists) ఈ తేదీని 2012 లో తప్పుగా చదివారని ప్రపంచం యొక్క నిజమైన ముగింపు 2020 జూన్ 21 అని పేర్కొన్నారు. అయితే ఇది కూడా ఫేక్ అని తేలిపోయింది.
కాగా ఇదీ యుగాంతం పేరుతో జరిగే సైకిల్ అని తెలుస్తోంది. క్రీ.శ. ఒకటో శతాబ్దంలోనే భూగ్రహం అంతమైపోతుంది అన్నారు. యుగాంతం అన్నారు. ఆ తర్వాత ప్రతి పదేళ్లకో, యాభై ఏళ్లకో ఈ మాటలు వింటూనే ఉన్నాం. 1996 అన్నారు. కాదు1997 అన్నారు. అది కూడా కాదు 1999 అన్నారు. మళ్లీ 2001 అన్నారు. ఈ సారి 2012లో యుగాంత వచ్చి తీరాల్సిందే అన్నారు. 2012 తర్వాత భూగ్రహం అంతమైపోతుంది.. యుగాంతమిదే అని బల్లగుద్ది మరీ చెప్పారు. ఎనిమిది రోజుల్లో లక్ష కేసులు, భారత్‌లో కరోనా విశ్వరూపం, దేశ వ్యాప్తంగా 4,25,282 కోవిడ్-19 కేసులు, 13,699 మంది మృతి
ఆ సంవత్సరంలో ఆ పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. అయితే 2012 కూడా వచ్చింది, పోయింది. యుగాంతం ఉత్తదే అని తేలిపోయింది. ఇక డూమ్స్‌డే ప్రవచనాలు, మయాన్ క్యాలెండర్ ప్రకారం జూన్ 21, 2020 నాటికి ప్రపంచం అంతమైపోతుందని కొంతమంది సిద్దాంతకర్తలు పేర్కొడనంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అదేరోజు అమావాస్య, సూర్యగ్రహణం కూడా రావడంతో ఇది నిజమే అయ్యింటుందని భావించి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. నిన్న(ఆదివారం) 2020 జూన్ 21 ముగియడంతో అదంతా ఉత్తుత్తిదే అని తెలీంది. 2012 మాదిరిగానే మాయాన్ క్యాలెండర్ అంతా అబద్ధమేనని మరోసారి రుజువైంది.
ఈ మాయాన్ క్యాలెండర్ అనేది 1582 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది. అయితే దీనికి ముందు తేదీలను కనుగొనడానికి వివిధ క్యాలెండర్‌లను ఉపయోగించాల్సి వచ్చిందని సిద్దాంతకర్తలు తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రజలు ఎక్కువగా మయాన్, జూలియన్ క్యాలెండర్‌లను అనుసంరించేవారని సమాచారం. ప్రస్తుతం ప్రపంచ దేశ ప్రజలు ఎక్కువగా గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తున్నారు. ఈ వింతైన సిద్ధాంతం ప్రకారం జూలియన్ క్యాలెండర్ మరో క్యాలెండర్‌కు మార్చబడుతున్న సమయంలో ఈ క్యాలెండర్ నుంచి సంవత్సరంలోని 11 రోజులు పోయాయాని నిపుణులు పేర్కొన్నారు. ఈ తర్వాత రోజులు ఆ రోజులు జతచేయబడ్డాయి. కానీ దీని ప్రకారం ప్రస్తుతం మనం 2020లో కాకుండా 2012లో ఉన్నామని నిపుణులు చెబుతున్నారు.
పాలో తగలోగుయిన్ అనే శాస్త్రవేత్త ఈ సిద్దాంతాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ... ‘జూలియన్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం మనం సాంకేతికంగా 2012లో ఉన్నాము. గ్రెగోరియన్ క్యాలెండర్లోకి మారడం వల్ల సంవత్సరంలో కోల్పోయిన 11 రోజులను కొల్పోయాం. గ్రెగోరియన్ క్యాలెండర్ బట్టి (1752-2020) సార్లు 11 రోజులు = 2,948 రోజులు ఉపయోగించి 268 సంవత్సరాలు. 2,948 రోజులు / 365 రోజులు (సంవత్సరానికి) = 8 సంవత్సరాలు’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం మనం జూన్ 21, 2020 అనేది కి డిసెంబర్ 21, 2012 అవుతుంది. దీంతో కొంతమంది సిద్ధాంతకర్తలు 2012 డిసెంబర్ 21ని ప్రపంచ అంతంగా ప్రతిపాదించారు.
ఇదిలా ఉంటే డేవిడ్ మీడ్ అనే ఓ క్రిస్టియన్ న్యూమరాలజిస్ట్ అయితే సెప్టెంబర్ 23, 2017న యుగాంతం వస్తుందని, నిబిరు అనే ఓ గ్రహం భూమిని ఢీకొనడంతో మొత్తం నాశనం అయిపోతుందని చెప్పుకొచ్చాడు. నాసా అలాంటి ఒక గ్రహమే లేదని కొట్టిపడేసినా ఆయన మాత్రం దీన్నే ప్రచారం చేస్తూ వచ్చాడు. అది కూడా పుకారని తేలిపోయింది.