EVM-VVPAT Verification: పేపర్ బ్యాలెట్‌కు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, 100 శాతం వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదంటూ పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం
ఈవీఎం, వీవీప్యాట్‌లపై దాఖలైన అన్ని పిటిషన్లను (EVM-VVPAT Verification) సుప్రీం కోర్టు కొట్టేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండబోదు అని సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది.
New Delhi, April 26: లోక్ సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈవీఎం, వీవీప్యాట్‌లపై దాఖలైన అన్ని పిటిషన్లను (EVM-VVPAT Verification) సుప్రీం కోర్టు కొట్టేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండబోదు అని సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది.
ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని,ఈవీఎంలలో ఓట్లతో పాటు వీవీప్యాట్ల స్లిప్‌లను కూడా లెక్కించాలని సుప్రీంకోర్టులో (Supreme Court) పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఈ విజ్ఞప్తితో పాటుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్(ADR) పిటిషన్ వేసింది. ఈ పిటీషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. తీర్పును పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మొదలైన లోక్ సభ రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్.. 15.88 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు అవకాశం.. బరిలో రాహుల్ గాంధీ సహా అతిరథులు
అయితే శుక్రవారం ఉదయం ఆ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్లను వంద శాతం సరిచూసుకోవాలని చేసిన డిమాండ్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లతో వంద శాతం క్రాస్ వెరిఫికేషన్ కుదరదని కోర్టు చెప్పింది.ఈవీఎంల స్థానంలో మళ్లీ పేపర్ బ్యాలెట్లను వాడాలన్న అభ్యర్థనను కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. వీవీప్యాట్ల ఫిజికల్ డిపాజిట్ కూడా కుదరదు అని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
వ్యవస్థలో సమతుల్య దృక్పథం ముఖ్యమే. కానీ, ఆ వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం సంశయవాదాన్ని పెంపొందిస్తుంది. అందుకే.. అర్థవంతమైన విమర్శలు అవసరం. అది న్యాయవ్యవస్థ అయినాసరే చట్ట సభలు అయినాసరే. ప్రజాస్వామ్యం అంటేనే అన్నింటా సామరస్యం పాటిస్తూ నమ్మకాన్ని కొనసాగించడం. విశ్వాసం, పరస్సర సహకారం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయొచ్చు. అనుమానాలతో ఈవిఎంలను గుడ్డిగా వ్యతిరేకించొద్దు’’ అని జస్టిస్ దత్తా తీర్పు ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్, ఎస్పీ చేసేవన్నీ విభజన రాజకీయాలే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని మండిపడిన ప్రధాని మోదీ
ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది. వీవీప్యాట్‌లు వందశాతం సరిపోల్చాలని వచ్చిన పిటిషన్లు సరికాదు. కానీ, ఈవీఎంలు - వీవీ ప్యాట్లకు సంబంధించి రెండు సూచనలు చేస్తున్నాం. సింబల్ లోడింగ్ తర్వాత SLUలు సీల్ చేసి 45 రోజులు భద్రంగా ఉంచండి. ఫలితాల తర్వాత అభ్యర్థులు కోరితే ఈవీఎంలు పరిశీలించుకోవచ్చు. ఇంజనీర్ల బృందంతోనూ పరిశీలన చేసుకోవచ్చు. ఈవీఎంల పరిశీలనకు అభ్యర్థుల నుంచి 7 రోజుల గడువు ఇవ్వాలి. అంతేగానీ మళ్లీ బ్యాలెట్‌లు పెట్టాలని చెప్పలేం అని తీర్పు ద్వారా వెల్లడించారు. ఈ వెరిఫికేషన్‌కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే... ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది.
వీవీప్యాట్ మెషిన్లపై ఓటరుకు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో ఏడు సెకన్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాస్‌ను ఏర్పాటుచేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది.
ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది.
వీవీప్యాట్ ఎందుకు?
ఓటర్ తాను వేసిన ఓటు పడిందా? లేదా?.. పడితే తాను అనుకున్న అభ్యర్థికే పడిందా? ఇదంతా తెలసుకోవడం కోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) తీసుకొచ్చింది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. ఆ తర్వాత దఫ దఫాలుగా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తూ వచ్చింది.