Newdelhi, Apr 26: లోక్ సభ ఎన్నికలు-2024లో (Loksabha Elections 2024) భాగంగా దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ (Second Phase) మొదలైంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ షురూ అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 1,202 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 15.88 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నిజానికి రెండో దశలో 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్ లోని బేతుల్ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంలో అక్కడ పోలింగ్ రీషెడ్యూల్ అయ్యింది.
Voting for the second phase of #LokSabhaElections2024 kicks off! 🗳️
Today, 88 seats across 13 states and Union Territories are up for grabs#June4WithCNNNews18 #ElectionsWithNews18 pic.twitter.com/990vjMmpBt
— News18 (@CNNnews18) April 26, 2024
పోటీలో అగ్రనాయకులు
ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ నేత తేజస్వి సూర్య, హేమమాలిని తదితరులు పోటీలోఉన్నారు. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాం, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లలో 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది.