Election Commission (File Photo)

రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లస్వీకరణ  ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలతోపాటు డమ్మీ, ఇండిపెండెంట్‌ అభ్యర్ధులు భారీగానే నామినేషన్లు వేశారు. రేపు(శుక్రవారం) నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ, వైసీపీలో చేరిన మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌ రెడ్డి దంపతులు, వీడియో ఇదిగో..

ఏపీ రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. కాగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతోపాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు(ఉప) మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

జూన్‌ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 547 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం​ 29 నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఇక ఏపీలో ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు దాఖలయ్యాయి. 25 లోక్‌సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలు అయ్యాయి.