Manmohan Singh Funeral Updates: నేటి ఉదయం.11.45 గంటలకు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. నిగమ్ బోధ్ ఘాట్ లో అంతిమ సంస్కారాలు (లైవ్)
శనివారం ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో జరుగుతాయని ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
Newdelhi, Dec 28: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh Funeral Updates) అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు ఢిల్లీలోని (Delhi) నిగమ్ బోధ్ ఘాట్ లో జరుగుతాయని ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. కాగా మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సంతాప తీర్మానం చేసింది. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. వచ్చే నెల 1వ తేదీ వరకు ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ 7 రోజులపాటు దేశవ్యాప్తంగా, విదేశాల్లోని ఇండియన్ మిషన్స్, రాయబార కార్యాలయాల్లో జాతీయ జెండాను సగం వరకు ఎగురవేయనున్నారు.
LIVE Video:
మన్మోహన్ స్మారక స్థలం
అంత్యక్రియల రోజు అంటే నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు హాఫ్ డే సెలవు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ కు అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని కోరారు.