Mamata calls Delhi meet: విపక్షాలను ఏకం చేస్తున్న మమతా బెనర్జీ, 22 మంది నేతలకు లేఖ, రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిపై చర్చించే అవకాశం, సోనియా గాంధీ, సీఎం కేసీఆర్ సహా 19 పార్టీలకు ఆహ్వానం
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Benarjee).. కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఓడించేందుకు విపక్షాలతో సమావేశానికి రెడీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం మమతా బెనర్జీ భవిష్యత్తు కార్యాచరణకు ప్లాన్ చేశారు
kolkata, June 12: రాష్ట్రపతి ఎన్నికలకు (Prez polls) షెడ్యూల్ విడుదలైన వేళ దేశ రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Benarjee).. కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఓడించేందుకు విపక్షాలతో సమావేశానికి రెడీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం మమతా బెనర్జీ భవిష్యత్తు కార్యాచరణకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే మమత.. దేశంలోని విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంయుక్త వ్యూహాన్ని రూపొందించేందుకు జూన్ 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి వారిని హాజరుకావాలని మమతా బెనర్జీ లేఖలో కోరారు.
కాగా, జూన్ 15న మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, 22 మంది విపక్ష నేతలు, సీఎంలకు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి (Sonia Gandhi) మమత లేఖ రాశారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR), ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే(Uddav Thakrey), అరవింద్ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, హేమంత్ సొరెన్, భగవంత్ మాన్లు ఉన్నారు.
8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహా 22 మంది జాతీయ నేతలకు మమత లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా విపక్షాలను బెంగాల్ సీఎం కూడగడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో బలమైన ప్రత్యర్థిని బరిలో నిలిపేందుకు మమత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ నెల 15న ఢిల్లీలో నిర్వహించే భేటీకి 22 మంది నేతలకు ఆహ్వానం పంపారు.