Farmers’ Protest: రాకేశ్ టికాయత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, రైతు గళం వినిపించకుండా చేసేందుకు నన్ను నిర్భంధించారని తెలిపిన రైతు నేత, తమ పోరాటం ఆపేది లేదని ట్వీట్
నిరుద్యోగ సమస్యపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే నిరసన (Farmers’ Protest) కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్‌ను (Rakesh Tikait ) ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
New Delhi, August 22: రైతు సంఘాల సమాఖ్య ఎస్‌కేఎం నేడు జంతర్‌మంతర్‌లో (Jantar Mantar ) మహాపంచాయత్ తలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నిరుద్యోగ సమస్యపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే నిరసన (Farmers’ Protest) కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్‌ను (Rakesh Tikait ) ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్న టికాయత్‌ని ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఆదివారం మధ్యాహ్నం పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏమైంది ?, గులాం నబీ బాటలో ఆనంద్ శర్మ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా
మధువిహార్ పోలీస్ స్టేషన్‌కి తరలించి వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా అభ్యర్థించామని.. ఆయన ఒప్పుకున్నారని స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ తెలిపారు. రైతుల గొంతును అణచివేయలేరని ట్విటర్ ద్వారా టికాయత్ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో అనవసరంగా గుమిగూడటాన్ని నివారించడానికే తికాయత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
Here's Protest Visuals
రైతు గళం వినిపించకుండా చేసేందుకు కేంద్రం ఆదేశాల మేరకే ఢిల్లీ పోలీసులు తనను నిర్బంధంలోకి తీసుకున్నారని తికాయత్ ఆరోపించారు. ఇది మరో విప్లవానికి నాంది కానుందని, తమ పోరాటం ఆపేది లేదని ఆయన ట్వీట్ చేశారు. తికాయత్‌ను నిర్బంధించడాన్ని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఖండించారు.