Congress leader Anand Sharma (ANI Photo)

New Delhi, August 21: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ అత్యున్నత పదవులకు రాజీనామా చేస్తున్నారు. మొన్న గులాం నబీ ఆజాద్ ఇటీవల జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కీలక పదవి రాజీనామా చేసిన విషయం విదితమే. తాజాగా మరో సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ కూడా తాజాగా అదే బాట పట్టారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌ పదవికి ఆదివారం రాజీనామా (Anand Sharma quits) చేశారు.

పార్టీ సమావేశాల్లో తనను పట్టించుకోవడంలేదని, సమావేశాలకు తనను ఆహ్వానించడంలేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభలో కాంగ్రెస్ ఉప నేత అయిన ఆనంద్‌ శర్మ ఈ ఏడాది ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ స్టీరింగ్ కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యున్నత కాంగ్రెస్‌ నేతల్లో ఆయన ఒకరు. అయితే పార్టీ సమావేశాలకు ఆయనను సంప్రదించకపోవడం, ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్యన్‌ పదవికి ఆదివారం రాజీనామా చేశారు.

ఇప్పటిదాకా 5గురిని చంపామంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు, వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన రాజస్థాన్ పోలీసులు

మరోవైపు ఈ ఏడాది చివర్లో హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌ పదవికి ఆనంద్‌ శర్మ రాజీనామా చేయడం కాంగ్రెస్‌పై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తున్నది.