Farmers' Protest: కొనసాగుతున్న రైతుల ఆందోళన, నేడు రైతు సంఘాల కమిటీతో అమిత్ షా, తోమర్ భేటీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేసున్న రైతు సంఘాలు
వ్యవసాయ చట్టాల రద్దు తరువాత కూడా రైతులు తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించినా పెండింగ్ అంశాలపై ప్రభుత్వం నిర్ధిష్ట హామీ ఇస్తేనే ఆందోళన (Farmers' Protest) విరమిస్తామని రైతు సంఘాల ప్రతినిధులు తేల్చిచెబుతున్నాయి.
New Delhi, December 8: వ్యవసాయ చట్టాల రద్దు తరువాత కూడా రైతులు తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించినా పెండింగ్ అంశాలపై ప్రభుత్వం నిర్ధిష్ట హామీ ఇస్తేనే ఆందోళన (Farmers' Protest) విరమిస్తామని రైతు సంఘాల ప్రతినిధులు తేల్చిచెబుతున్నాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించడం, విద్యుత్ సవరణల బిల్లు ఉపసంహరణ, రైతులపై నమోదైన కేసుల రద్దు, రైతుల నిరసనలో మరణించిన అన్నదాతల కుటుంబాలకు పరిహారం చెల్లింపు వంటి అంశాలను ప్రధానంగా రైతు సంఘాలు కేంద్రం ముందుంచాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన ముసాయిదాపై కమిటీ ( Samyukta Kisan Morcha Committee) అసంతృప్తి వ్యక్తం చేసింది.అయితే కమిటీకి కేంద్ర ప్రభుత్వం పంపిన ముసాయిదా ప్రతిపాదనపై కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తాజా ప్రతిపాదన పంపింది. ప్రభుత్వం పంపిన తాజా ప్రతిపాదనపై కమిటీ చర్చిస్తోందని కమిటీ సభ్యులు అశోక్ ధవలే తెలిపారు. ప్రభుత్వం ముందుగా పంపిన ప్రతిపాదనలో లోటుపాట్లు ఉండటంతో వాటికి సవరణలు సూచిస్తూ మంగళవారం రాత్రి దాన్ని తిరిగి ప్రభుత్వానికి పంపామని చెప్పారు.
ఇదిలా ఉంటే అఖిల భారత రైతు సంఘం కార్యాలయంలో కిసాన్ నేతలు సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి నుంచి నిన్న సాయంత్రం చర్చలకు రావాలని పిలుపు రావడంతో ఇవాళ నేతల భేటీ అయ్యారు. ఇప్పటికే అయిదుగురు సభ్యులతో సంయుక్త కిసాన్ మోర్చా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం చర్చలకు ( Discuss Pending Issues) పిలవడంతో.. ఏయే అంశాలను లెవనెత్తాలో అజెండా ఖరారు చేయనున్నారు. మధ్యాహ్నం 2గం.లకు సింఘూ సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు భేటీ కానున్నారు.
ఈ భేటీలో ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే రైతులపై నమోదు అయిన కేసులను ఎత్తివేసే ప్రతిపాదన కేంద్రం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వ ప్రతిపాదనను కిసాన్ సంఘాలు ఆమోదిస్తే.. అప్పుడు 15 నెలలుగా సాగుతున్న రైతు పోరాటం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొత్త సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఉభయసభల్లోనూ ఆ రద్దుకు చెందిన బిల్లులు కూడా పాసయ్యాయి. నేడు రైతు సంఘాల కమిటీ కేంద్రమంత్రి అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్ లతో భేటీ కానుంది.
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశీష్ మిశ్రాతో సహా 14 మందిపై హత్య కేసు నమోదు చేయాలని కోరుతూ లఖింపూర్ హింసలో చనిపోయిన జర్నలిస్టు సోదరుడు ఈ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఈ హింసాత్మక ఘటనపై ఇప్పటికే పలు పిటిషన్లను విచారణ చేస్తున్న కోర్టు విడిగా మరొక పిటిషన్ అవసరంలేదని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ప్రాంతంలో అక్టోబర్ 3న జరిగిన హింసలో నలుగురు రైతులు, ఒక పాత్రికేయుడితో సహా 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)