పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇటీవల మృతి చెందిన పలువురు సభ్యులకు లోక్‌సభలో నివాళులు అర్పించారు. మూడు నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేందుకు ఇవాళ లోక్‌స‌భ‌లో కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం (Farm Laws Repeal Bill 2021 Passed) తెలిపింది. అయితే ఆ స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. బిల్లుపై చర్చ నిర్వ‌హించ‌కుండానే సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు విప‌క్షాలు ఆరోపించాయి. దీంతో స‌భ‌లో ర‌భ‌స మొద‌లైంది. ఈ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ డిమాండ్ చేశారు. .

చ‌ర్చ లేకుండా మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు చేయ‌డంతో విప‌క్షాలు గంద‌ర‌గోళం సృష్టించాయి. మూజువాణి ఓటుతోనే బిల్లుకు ఓకే చెప్పేశారు. దీంతో విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకువ‌చ్చారు. అయితే చ‌ర్చ‌ను చేప‌ట్టేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు చెప్పిన స్పీక‌ర్ బిర్లా.. ఆ గంద‌ర‌గోళం మ‌ధ్య స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వాయిదా వేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)