New Delhi November 19: సాగు చట్టాలను రద్దు చేయడంపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. రైతులు చేపట్టిన సత్యాగ్రహం, కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని ఓడించినట్లు రాహుల్ విమర్శించారు. దేశ రైతులు తమ సత్యాగ్రహ దీక్షతో.. కేంద్ర సర్కార్ అహంకారాన్ని తలదించుకునేలా చేశారన్నారు. ఇది అన్యాయంపై విజయమని, ఈ సందర్భరంగా రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. జై హింద్, జై కిసాన్ అంటూ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
देश के अन्नदाता ने सत्याग्रह से अहंकार का सर झुका दिया।
अन्याय के खिलाफ़ ये जीत मुबारक हो!
जय हिंद, जय हिंद का किसान!#FarmersProtest https://t.co/enrWm6f3Sq
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2021
రైతు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన పాత వీడియోను కూడా తన ట్విట్టర్‌లో రాహుల్ షేర్ చేశారు. రైతు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చేస్తామని, తన మాటాలను గుర్తుపెట్టుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను రాహుల్ పోస్టు చేశారు.
ఏడాది నుంచి దేశవ్యాప్తంగా రైతులు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. ఆ ఆందోళనల్లో వందల సంఖ్యలో అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటన చేసిన తర్వాత రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.