Farmers’ Protest: రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత, వీడియోలు ఇవిగో..

పంటలకు కనీస మద్దతు ధర అంశంలో రైతులు కేంద్రంపై మరోమారు దండయాత్ర ప్రారంభించారు (Formers protest). మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్‌తో ఢిల్లీ ఛలో చేట్టారు

Farmers’ Protest (Photo Credit: ANI)

పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంటలకు కనీస మద్దతు ధర అంశంలో రైతులు కేంద్రంపై మరోమారు దండయాత్ర ప్రారంభించారు (Formers protest). మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్‌తో ఢిల్లీ ఛలో చేట్టారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. వీళ్లను అడ్డుకునేందుకు బహు అంచెల వ్యవస్థతో పోలీసులు సిద్ధం చేశారు.  త‌గ్గేదే లేదంటున్న అన్న‌దాత‌లు! ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో మ‌రోసారి హైటెన్ష‌న్, కేంద్రానికి విధించిన డెడ్ లైన్ ముగియ‌గానే హ‌స్తిన‌వైపు క‌దులుతామంటూ హెచ్చ‌రిక‌

శంభు సరిహద్దు (Shambhu border) వద్దకు భారీగా చేరుకొని రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు రాజధానిలోకి ప్రవేశించకుండా ముళ్ల కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులపై భద్రతా దళాలు మరోసారి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. డ్రోన్లతో రైతులపైకి టియర్‌ గ్యాస్‌ వదిలారు. దీంతో కొందరు రైతులకు స్వల్ప గాయపడ్డారు.రైతులపై హర్యానా పోలీసులు ఇప్పటికే ఓసారి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన విషయం తెలిసిందే.

Here's PTI Videos

పోలీసుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని వాపోతున్నారు. తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుత ప్రదర్శనకూ అనుమతివ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు



సంబంధిత వార్తలు

Andhra Pradesh: వైసీపీ వాళ్లు ఎవరైనా మాట్లాడితే బొక్కలో వేస్తాం, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వంలో ఎమ్మార్వో ఆఫీసులనే తాకట్టు పెట్టారని చంద్రబాబు మండిపాటు

Free Gas Cylinders Scheme: ఏపీలో రేపటి నుంచి ఉచిత సిలిండర్ పథకం అమల్లోకి, మూడు సిలిండర్లు ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలో తెలుసుకోండి

YS Jagan Slams CM Chandrababu: రైతులను బాధపెట్టిన వారు బాగుపడినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు, సీఎం చంద్రబాబు ఉచిత పంటల బీమా పథకం రద్దు నిర్ణయంపై మండిపడిన జగన్

Delhi Air Pollution: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీం చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు, మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేశానని, కాలుష్యం ఆందోళనకరంగా మారుతుందని వెల్లడి