Supreme Court: చరిత్రలో ఫస్ట్ టైం...సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తొమ్మిది మంది ఒకేసారి ప్రమాణ స్వీకారం, కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ( SupremeCourt ) కు కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం ( 9 Supreme Court Judges take oath in one go) చేశారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
New Delhi, August 31: చరిత్రలో ఫస్ట్ టైం.. సుప్రీంకోర్టు ( SupremeCourt ) కు కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం ( 9 Supreme Court Judges take oath in one go) చేశారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు (Nine Supreme Court Judges) ప్రమాణస్వీకారం చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. కరోనా నేపథ్యంలో ప్రమాణస్వీకార వేదికను మార్పు చేశారు.
ఒకటో కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియంలోకి వేదికను మార్చారు. జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ నిర్ణయించారు. జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. సుప్రీం కోర్టు జడ్జిలుగా ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ విక్రమ్‌నాథ్ ఉన్నారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.
Here's ANI Tweet
సుప్రీం కోర్టుకు కొత్త జడ్జిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. ఇటీవల సుప్రీంకోర్టుకు కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తులను నియమిస్తూ.. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ముగ్గురు మహిళలతో సహా తొమ్మిది మంది కొత్త న్యాయమూర్తులప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు బలం CJI తో సహా 33 కి పెరిగింది.
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తులు
1. Justice Abhay Shreeniwas Oka
2) Justice Vikram Nath
3) Justice Jitendra Kumar Maheshwari
4) Justice Hima Kohli
5) Justice B V Nagarathna.
6) Justice C T Ravikumar
7) Justice M M Sundresh
8) Justice Bela M Trivedi
9) Justice P S Narasimha