Foreign Currency In Peanuts: వేరుశనగ కాయల్లో రూ.45 లక్షల విలువ గల విదేశీ కరెన్సీ, ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి పట్టుబడ్డ ప్రయాణీకుడు, అదుపులోకి తీసుకున్న పోలీసులు
వారు అది చూసి అవాక్కయ్యారు.
New Delhi, Febuary 12: విదేశాల నుంచి అక్రమంగా బంగారం, విలువైజ వజ్రాలను తరలించేదుకు దళారులు రకరకాల మార్గాలను ఎంచుకుంటారన్న విషయం తెలిసిందే. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ.. ఇలా నగరం ఏదైనా, ఎయిర్‌పోర్టులలో అక్రమ బంగారంతో ప్రయాణికులు ఇప్పటికే చాలామంది పట్టుబడ్డారు. అయితే ఈ ప్రయాణికుడు సరికొత్తగా ఆలోచించాడు. అయితే అది కాస్తా బెడిసికొట్టడంతో అధికారుల చేతికి చిక్కాడు.
ఓ వ్యక్తి రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని వేరుశనగ కాయల్లో అక్రమంగా తీసుకు వస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో (Delhi Airport) సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) (Central Industrial Security Force) సిబ్బందికి చిక్కగా.. వారు అది చూసి అవాక్కయ్యారు. వివరాల్లోకెలితే..
బుధవారం ఉదయం మురద్ ఆలం అనే వ్యక్తి ఎయిరిండియా (Air India flight) విమానంలో దుబాయి నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. అయితే అతను విదేశీ కరెన్సీ నోట్లను వేరు శనగ కాయల్లో (Foreign Currency In Peanuts) పెట్టుకుని వచ్చాడు.
Here's CISF Tweet Video
వేరుశెనగకాయల్లో ఉన్న గింజలు తీసేసి వాటి స్థానంలో విదేశీ కరెన్నీ నోట్లను దారంతో చుట్టి వాటికి సెలో టేప్ వేసి తీసుకు వచ్చాడు. మరోవైపు బిస్కెట్ ప్యాకెట్లలోనూ నోట్లను అమర్చాడు. వీటి విలువ దాదాపు రూ. 45 లక్షలు ఉంటుంది.
Here's Video
High volume of foreign currencies were found concealed in cooked mutton pieces, peanuts, biscuit packets and other eatable items kept inside baggage. CISF arrested one person named Murad Alam at IGI Airport, delhi with this illegal currency.@CISFHQrs @TV9Bharatvarsh pic.twitter.com/Jo6p0e69Al
— Jitender Kr Sharma (@jitendesharma) February 12, 2020
కాగా మురద్ అలీ కదలికలు అనుమానస్పదంగా కనిపించాయి. బ్యాగ్‌లో బిస్కెట్ ప్యాకెట్లు, వేరుశెనగకాయలను అంత భద్రంగా తీసుకురావడం ఏంటని పోలీసులు అనుమానించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అతణ్ని అదుపులోకి తీసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాటిని బయటకు తీసి లెక్కించగా.. వాటి విలువ రూ.45 లక్షలు ఉంటుందని తేలింది.
గ్రహాంతరవాసుల గుట్టు చైనా చేతిలో
మురద్ దగ్గర్నుంచి సౌదీ రియాల్, ఖతారీ రియాల్, కువైట్ దినార్, ఒమనీ రియాల్, యూరో తదితర కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా నగదు స్మగ్లింగ్ అసాధారణమని సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ జనరల్ హేమేంద్ర సింగ్ తెలిపారు. మురాద్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
దక్షిణాదిన హవాలా దందా, రూ.3,300 కోట్ల స్కాం వెలుగులోకి
నిందితుడు మురద్ ఆలం ఈ కరెన్సీని దుబాయ్ నుంచి ఢిల్లీకి తీసుకువస్తూ పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.