Shanghai. January 12: గ్రహాంతరవాసుల జాడను కనుగునేందుకు చైనా ఎప్పటినుంచో కొత్త టెక్నాలజీని(New Technology) రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖగోళ రహాస్యాన్ని కనిపెట్టేందుకు చైనా అతిపెద్ద టెలిస్కోప్ (China Gigantic Telescope)లాంచ్ చేసింది. ఇది చైనా అభివృద్ధిచేసిన ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్. పేరు ఫాస్ట్(ఫైవ్ హండ్రెడ్ మీటర్ అపెర్చ్యూర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్).
దీనికి అమర్చిన డిష్ వ్యాసం(డయామీటర్) 500 మీటర్లు.. ఆ కొలత ఆధారంగానే టెలిస్కో్‌పకు ఆ పేరు పెట్టారు. లాంఛనంగా దీని కార్యకలాపాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. గ్విజౌ ప్రావిన్స్.. పింగ్‌టాంగ్ కౌంటీలోని దావోదాంగ్‌లో ఇది ఉంది. 30 ఫుట్‌బాల్ మైదానాలంత (30 football fields)విశాలమైన ప్రదేశంలో దీనిని నిర్మించారు.
చైనాలో Sky Eye అనే పేరుతో పిలిచే పర్వత ప్రాంతమైన సౌత్ వెస్టరన్ ప్రావిన్స్‌లోని గుయీజౌలో ఈ టెలిస్కోప్‌ను నిర్మించారు. జాతీయ స్థాయిలో ఆమోదం పొందడంతో ఈ టెలిస్కోప్ కు సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించినట్టు చైనా మీడియా తెలిపింది. కాగా 2016లోనే దీని నిర్మాణం పూర్తి అయింది.
అప్పటినుంచి ఏళ్ల తరబడి టెస్టింగ్ రన్ జరుగుతోంది. FAST చీఫ్ ఇంజినీర్ జియాంగ్ పెంగ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ టెలిస్కోప్ ట్రయల్ ఆపరేషన్స్ జరిగాయని అన్నారు. ఎంతో సున్నితమైన ఈ టెలిస్కోప్.. ప్రపంచ రెండో అతిపెద్ద టెలిస్కోప్ కంటే 2.5 రెట్లు కంటే ఎక్కువని ఆయన తెలిపారు. కొంత విలువైన సైంటిఫిక్ డేటాను కూడా ఈ ప్రాజెక్టు సమయంలో పొందినట్టు చెప్పారు.
రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో తక్కువ ప్రీక్వెన్సీ గురుత్వాకర్షణ వేవ్ డెటెక్షన్, నక్షత్ర అణువుల వంటి కొన్ని ప్రాంతాలను గుర్తించడానికి ఈ టెలిస్కోప్ దోహదపడుతుందని జియాంగ్ చెప్పారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాదిలో మానవ సహిత సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని బీజింగ్ యోచిస్తోంది.